తెలంగాణలో గురుకుల విద్య ప్రభావంపై మాజీ ఐపీఎస్ అధికారి, రాజకీయ నాయకుడు ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ భావోద్వేగ వ్యాఖ్యలు చేశారు. గతంలో గురుకుల విద్య ద్వారా విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదిగారని, ప్రస్తుతం పరిస్థితులు మారుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
కేసీఆర్ పాలనలో గురుకుల విద్యార్థులు ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లేవారు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ పాలనలో విద్యార్థులు శవాలై ఇంటికి వస్తున్నారు అంటూ ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ
గద్వాల జిల్లా అయిజ మండలానికి చెందిన నిరీక్షణ, ప్రసన్న అనే ఇద్దరు యువతుల ఉదాహరణను ఆయన ప్రస్తావించారు. చిన్న వయసులోనే బాల్య వివాహాలకు గురి చేయాలని వారి కుటుంబాలు ప్రయత్నించినప్పటికీ, వారు ధైర్యంగా ఎదిరించి చదువును కొనసాగించారని తెలిపారు.
నిరీక్షణ ఢిల్లీ యూనివర్సిటీ మరియు హర్యానా సెంట్రల్ యూనివర్సిటీలో చదివి ఉన్నత విద్యను అభ్యసించిందని, ప్రసన్న ఢిల్లీతో పాటు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో చదివి ప్రస్తుతం అమెరికాలో ఐదేళ్ల కోర్సు కోసం వెళ్లిందని ఆయన వివరించారు.
ALso Read:కర్ణాటకలో నీటి కొరత ముప్పు!
ఈ విద్యార్థులు తన వద్దకు వచ్చి మీ కృషి, కేసీఆర్ ఆశీర్వాదం వల్ల ఈ స్థాయికి చేరుకున్నాం అని చెప్పడం తనకు ఎంతో ఆనందం కలిగించిందని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. గురుకుల విద్య వ్యవస్థ ద్వారా పేద, వెనుకబడిన వర్గాల విద్యార్థులు జీవితాల్లో పెద్ద మార్పు సాధిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఇలాంటి అవకాశాలను మరింత విస్తరించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.

