సీఎం రేవంత్ రెడ్డిపై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్ర విమర్శలు చేశారు. బీఆర్ఎస్ ప్రశ్నిస్తే బాడీ షేమింగ్ చేయడం సిగ్గుచేటు..నా గుండు గురించి మాట్లాడినా అవినీతిపై ప్రశ్నిస్తూనే ఉంటానని చెప్పారు. విద్యార్థుల వద్ద మాట్లాడే తీరు సీఎంకు తెలియదన్న ప్రవీణ్ కుమార్…గురుకుల పాఠశాలల స్కాంపై ప్రశ్నిస్తే ప్రభుత్వం ఎదురుదాడులు చేస్తోందన్నారు.
అవగాహన లేని మంత్రులతో బీఆర్ఎస్‌పై దాడి చేయిస్తున్నారని ఆరోపించింది. వల్గర్ భాష మాట్లాడే సీఎంగా రేవంత్ రెడ్డి నిలిచారని విమర్శించారు. మాకు సంస్కారం అడ్డుగా ఉంది.. ఆ భాష మా నాయకుడు నేర్పలేదన్న ఆర్ఎస్పీ.. ప్రతిపక్షాల ప్రశ్నలకు సమాధానం చెప్పాలని ప్రభుత్వానికి డిమాండ్ చేశారు.
ప్రజలు బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని…. సీఎం తప్పులకు అమాయక మంత్రులను అడ్డం పెట్టుకుంటున్నారని ఆరోపించారు. నాగర్ కర్నూల్‌లో మర్రి జనార్దన్ రెడ్డి నివాసంలో మీడియా సమావేశంలో మాట్లాడిన ఆర్‌ఎస్పీ.. ప్రభుత్వ అవినీతి, అక్రమాలపై పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ప్రజా సమస్యలపై బీఆర్ఎస్ గళం వినిపిస్తూనే ఉంటుందని వ్యాఖ్యానించారు.
Also Read:అమెరికా-ఇరాన్..చారిత్రాత్మక శాంతి ఒప్పందం

