అమెరికా-ఇరాన్..చారిత్రాత్మక శాంతి ఒప్పందం

0
- Advertisement -

అమెరికా మరియు ఇరాన్ దేశాల మధ్య దశాబ్దాలుగా కొనసాగుతున్న శత్రుత్వానికి ముగింపు పలుకుతూ ఒక కీలక పరిణామం చోటుచేసుకుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్…. ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ వర్చువల్ విధానంలో 14 పాయింట్ల అవగాహనా ఒప్పందం (MoU) పై సంతకాలు చేశారు. ఇస్లామాబాద్ అవగాహనా ఒప్పందంగా పిలుస్తున్న ఈ చారిత్రాత్మక ఒప్పందం తక్షణమే అమలులోకి వచ్చింది. పారిస్‌లో ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌తో సమావేశమైన సందర్భంగా ట్రంప్ వ్యక్తిగతంగా ఈ ఒప్పందంపై సంతకం చేసినట్లు వైట్ హౌస్ వర్గాలు వెల్లడించాయి.

ఈ ఒప్పందం ప్రకారం ఇరు దేశాల మధ్య సైనిక చర్యలు శాశ్వతంగా నిలిచిపోనున్నాయి. ప్రపంచవ్యాప్తంగా చమురు రవాణాకు అత్యంత కీలకమైన ‘స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్’ (హార్ముజ్ జలసంధి) ని తక్షణమే పునఃప్రారంభించి, వాణిజ్య నౌకల సురక్షిత ప్రయాణానికి ఇరు దేశాలు అంగీకరించాయి. ఇరాన్‌పై ఉన్న ఆర్థిక ఆంక్షలను ఎత్తివేయడం…ఇరాన్ అణు కార్యక్రమంపై తుది నిర్ణయం తీసుకోవడానికి 60 రోజుల గడువును విధించుకున్నారు.

ఒప్పందంలో భాగంగా ఇరాన్ యొక్క సార్వభౌమాధికారాన్ని గౌరవిస్తూనే…. హార్ముజ్ జలసంధి ద్వారా ఉచితంగా నౌకల ప్రయాణానికి అనుమతిస్తారు. అలాగే అమెరికా ఇరాన్‌పై విధించిన నౌకాదళ దిగ్బంధనాన్ని తొలగిస్తుంది. ప్రతిఫలంగా, ఇరాన్ తమ వద్ద ఉన్న యురేనియం నిల్వలను నాశనం చేయడానికి మరియు అణు ఆయుధాలను తయారు చేయబోమని పునరుద్ఘాటించింది. ఇరాన్ యొక్క స్తంభింపజేసిన ఆస్తులను విడుదల చేయడంతో పాటు ఆ దేశ పునర్నిర్మాణం కోసం అమెరికా మద్దతుతో దాదాపు 300 బిలియన్ డాలర్ల ఆర్థికాభివృద్ధి ప్యాకేజీని కూడా ఈ ఒప్పందంలో పొందుపరిచారు.

ALso Read:2027 వరకు ఎల్‌నినో ఎఫెక్ట్!

ఈ శాంతి ప్రక్రియలో ఒమన్ మరియు ఇతర మధ్యప్రాచ్య దేశాలు కీలక పాత్ర పోషించాయి. లెబనాన్‌లో సైనిక చర్యల ముగింపు, ఇజ్రాయెల్-హెజ్బుల్లా మధ్య కాల్పుల విరమణ వంటి అంశాలు కూడా ఈ విస్తృతమైన శాంతి ప్రణాళికలో భాగమయ్యాయి.

- Advertisement -