తెలంగాణలో రూ.56 వేల కోట్ల పెట్టుబడులు

2
- Advertisement -

తెలంగాణలో ఒకేరోజు రూ.56 వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. రాష్ట్రానికి పెట్టుబడులే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి బృందం దావోస్ పర్యటన కొనసాగుతోంది. తెలంగాణలో రూ.45 వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు, రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది సన్ పెట్రో కెమికల్స్.

అలాగే కంట్రోల్ ఎస్ కంపెనీ రూ 10 వేల కోట్ల పెట్టుబడులు రాగా జేఎస్ డబ్ల్యూ రూ.800 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు సుముఖత వ్యక్తం చేసింది. తాజా పెట్టుబడులతో 15 వేల ఉద్యోగాలు లభించే అవకాశం ఉందని ప్రభుత్వ అధికారులు వెల్లడించారు. అలాగే హైదరాబాద్‌లో విప్రో విస్తరణకు అడుగు పడింది.

Also Read:హైదరాబాద్‌లో విప్రో విస్తరణ..

- Advertisement -