KTR:రూ. 545 కోట్ల‌తో 14 బ్రిడ్జిలు

16
- Advertisement -

మూసీ, ఈసీపై రూ. 545 కోట్ల‌తో 14 బ్రిడ్జిల‌కు శంకుస్థాప‌న చేసుకుంటున్నామ‌ని తెలిపారు మంత్రి కేటీఆర్. ఫ‌తుల్ల‌గూడా – పీర్జాదీగూడ బ్రిడ్జికి కేటీఆర్ శంకుస్థాప‌న చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన కేటీఆర్… హైద‌రాబాద్ మ‌హా న‌గ‌రానికి గొప్ప పేరు ప్ర‌ఖ్యాతులు తెచ్చిన న‌దిగా మూసీ న‌ది ఉండేద‌ని గుర్తు చేశారు.

గ‌త ప్ర‌భుత్వాలు ప‌ట్టించుకోక‌పోవ‌డంతో మూసీ న‌ది మురికి కూపంగా మారింది. మూసీ సుంద‌రీక‌ర‌ణ ప‌నులు కొన‌సాగుతున్నాయన్నారు. అక్టోబ‌ర్ చివ‌రి నాటికి నీటి శుద్దీక‌ర‌ణ ప‌నులు పూర్త‌వుతాయ‌న్నారు. హైద‌రాబాద్ ఒక అద్భుత దృశ్యాన్ని ఆవిష్క‌రించాలని…. శాశ్వతంగా, దీర్ఘ‌కాలికంగా ఉండేలా బ్రిడ్జిల నిర్మాణం చేప‌డుతామ‌న్నారు.

ఒక్కొక్క‌టిగా సీవ‌రేజి ట్రీట్‌మెంట్ ప్లాంట్‌లు పూర్తి చేసి బ్రిడ్జిలు క‌డుతున్నాం. 160 కిలోమీట‌ర్ల ఓఆర్ఆర్ చుట్టూ తిర‌గ‌కుండా మ‌ధ్య‌లో మూసీ న‌ది మీదుగా వెళ్లే విధంగా బ్రిడ్జిలు నిర్మిస్తాం అన్నారు. జీవో 118లోని చిన్న చిన్న టెక్నిక‌ల్ స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రిస్తాం అని తెలిపారు కేటీఆర్.

Also Read:రుద్రం కోట.. స‌క్సెస్ మీట్

- Advertisement -