పుష్ప…యాక్షన్‌ ఎపిసోడ్‌ కోసం ఎన్నికోట్లో తెలుసా..?

68
pushpa

స్టైలీష్ స్టార్‌ అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘పుష్ప’.మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఆగస్టు 13న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుండగా తెలుగుతో పాటు హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో విడుదల కానుంది.

తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఆసక్తికర వార్త టీ టౌన్‌లో చక్కర్లు కొడుతోంది. సినిమాలోని యాక్షన్ ఎపిసోడ్ కోసం ఏకంగా 40 కోట్ల భారీ మొత్తాన్ని ఖర్చు పెడుతున్నారట నిర్మాతలు. దీంతో అప్పడే ఈ భారీ యాక్షన్ సన్నివేశాలు చిత్రంలో ఏ రేంజ్ లో ఉండబోతున్నాయి అనే ఆసక్తి అందరిలో మొదలైపోయింది.

ఈ చిత్రంలో విలన్ గా మలయాళ స్టార్ ఫహద్ ఫాసిల్ నటిస్తుండగా జగపతిబాబు, ప్రకాష్ రాజ్, సునీల్, ధనుంజయ్ తదితరులు ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.