సాగర్ బైపోల్…ఓటేసిన నోముల భగత్

42
nomula-bhagat

నాగార్జునసాగ‌ర్‌ ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా కొన‌సాగుతోంది. ఈ సందర్భంగా టీఆర్ఎస్ ‌పార్టీ అభ్య‌ర్థి నోముల భ‌గ‌త్ కుటుంబ స‌మేతంగా ఓటుహ‌క్కు వినియోగించుకున్నారు. హాలియాలోని ఇబ్ర‌హీంపేట‌లో ఓటు వేశారు.

ఉద‌యం 7 గంట‌ల‌కు ప్రారంభ‌మైన పోలింగ్‌ రాత్రి 7 గంట‌ల వ‌ర‌కు జరగనుండగా చివరి గంటలో కరోనా పాజిటివ్ పేషంట్లకు ఓటు వేసేందుకు అవకాశం కల్పించనున్నారు. మొత్తం 41 మంది అభ్య‌ర్థులు బ‌రిలో నిలవగా ప్రధానంగా టీఆర్ఎస్,కాంగ్రెస్ మధ్య పోరు జరిగే అవకాశం ఉంది.

మొత్తం 2,20,300 ఓటర్లు ఉండగా ఇందులో 1,09,228 మంది పురుషులు, 1,11,072 మంది మ‌హిళ‌లు ఉన్నారు. మొత్తం 346 పోలింగ్ కేంద్రాల‌ను ఏర్పాటు చేశారు. మే 2న ఉప ఎన్నిక ఫ‌లితాలు వెలువ‌డ‌నున్నాయి.