టీటీడీ ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్స్ రిలీజ్..

48
- Advertisement -

టీటీడీ రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు విడుదలయ్యాయి. జులై, ఆగస్టు నెలల కోటాకు సంబంధించి దర్శన టికెట్లను ఆన్‌లైన్‌లో అందుబాటులోకి తీసుకొచ్చింది. టీటీడీ వెబ్‌సైట్‌ https://tirupatibalaji.ap.gov.in లో దర్శన టికెట్లు బుక్ చేసుకోవాలని టీటీడీ సూచించింది. టీటీడీ యాప్, వెబ్‌సైట్ ద్వారానే టికెట్లు బుక్ చేసుకోవాలని.. నకిలీ వెబ్‌సైట్స్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని కోరింది.

ఇక శ్రీవారి దర్శనానికి ఏకంగా 18 నుంచి 30 గంటలకుపైగా సమయం పడుతోంది. దీంతో శ్రీవారి సేవలు, వీఐపీ దర్శనాల్లో జూన్ 30 వరకు స్వల్ప మార్పులు చేశారు. శుక్ర, శని, ఆదివారాల్లో సుప్రభాత సేవకు విచక్షణ కోటాను రద్దు చేసింది టీటీడీ. ఈ నిర్ణయం ద్వారా 20 నిమిషాల సమయం ఆదా అవుతుందని భావిస్తున్నారు.

Also Read:లివర్ ఆరోగ్యంగా ఉండాలంటే.. !

శ్రీవారికి గురువారం తిరుప్పావడ సేవ ఏకాంతంగా నిర్వహిస్తారు.. తద్వారా 30 నిమిషాల సమయం ఆదా అవుతుందని టీటీడీ తెలిపింది. శుక్ర, శని, ఆదివారాల్లో వీఐపీ దర్శనాలకు సిఫార్సు లేఖలు స్వీకరించేది లేదని టీటీడీ తెలిపింది.

- Advertisement -