వీటితో మీ లీవర్‌ని శుభ్రపరుచుకోండి!

54
- Advertisement -

మానవ శరీరంలో అత్యంత ముఖ్యమైన అవయవలలో లివర్ ఒకటి. శరీరంలో చర్మం తరువాత అతిపెద్ద అవయవంగా లివర్ ఉంటుంది. లివర్ చేసే పనులు కూడా పెద్దగానే ఉంటాయి. తీసుకున్న ఆహారాన్ని ప్రోటీన్లుగా విటమిన్లుగా శరీరభాగాలకు సరఫరా చేయడం లివర్ యొక్క పని. అంతేకాకుండా శరీర సమతుల్యన్ని పరిరక్షించడంలో కూడా లివర్ కీలక పాత్ర పోషిస్తుంది. అలాంటి లివర్ ను ఆరోగ్యంగా ఉంచుకోవడం చాలా అవసరం. అయితే నేటి రోజుల్లో మారుతున్న జీవన విధానం, చెడు అలవాట్ల కారణంగా లివర్ దెబ్బతింటుంది. దాంతో లివర్ పనితీరు మందగించి అనారోగ్యం బారిన పడి ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. లివర్ ఆరోగ్యాపై దుష్ప్రభావాలు చూపే అలవాట్లలో ధూమపానం, మద్యపానం, వంటి ప్రధాన కారణం అని చెప్పవచ్చు. ఇవే కాకుండా మరికొన్ని అలవాట్లు కూడా లివర్ ఆరోగ్యాన్ని దెబ్బతిస్తాయి.

క్యారెట్,పండ్లు,గ్రీన్ టీ,ఆపీల్,బ్రొకొలి,నిమ్మకాయ,వాల్ నట్స్,క్యాబెజీ,క్యాలీఫ్లవర్,అవకాడో,వెల్లుల్లి, పసుపు వంటివి లివర్‌ శుభ్రపరచడానికి దోహదం చేస్తాయి.

శారీరక శ్రమ లేకపోవడం వల్ల బాడీలో కొవ్వు శాతం ఎక్కువగా పెరుగుతుంది. తద్వారా లివర్ పై కూడా కొవ్వు పెరుకుపోయి ఫ్యాటిలివర్ సమస్యకు దారి తీస్తుంది. ఫలితంగా లివర్ ఆరోగ్యం మందగిస్తుంది. కాబట్టి ప్రతిరోజూ వ్యాయామం చేయడం ఎంతో అవసరం అని నిపుణులు చెబుతున్నారు.

Also Read:సీత పాత్ర ఏ హీరోయిన్ చేస్తోందో?

నేటి రోజుల్లో జంక్ ఫుడ్ కు అలవాటు పడ్డ వారి సంఖ్య ఎక్కువగానే ఉంది. జంక్ ఫుడ్ ఎక్కువగా తినడం బాడీలో కొలెస్ట్రాల్ శాతం వేగంగా పెరుగుతుంది. దాంతో అధిక బరువు, ఊబకాయం వంటి సమస్యలు తలెత్తుతాయి. ఈ సమస్యలు కూడా లివర్ ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి. కాబట్టి జంక్ ఫుడ్ కు దూరంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.

మనం తీసుకునే ఆహారంలో ఉప్పుశాతం ఎక్కువగా ఉన్న అది లివర్ పనితీరుపై ప్రభావం చూపుతుంది. కాబట్టి కూరల్లోనూ, తినే ఆహారంలోనూ ఉప్పు తక్కువగా ఉండేలా చూసుకోవాలి.

ఇంకా లివర్ ఆరోగ్యంగా ఉండేందుకు ప్రతిరోజూ గ్రీన్ టీ, బ్లాక్ టీ వంటివి తాగాలని నిపుణులు చెబుతున్నారు. అలాగే విటమిన్ సి అధికంగా ఉండే నారింజా, అవగాడో, జామా, మామిడి వంటి పండ్లు ఎక్కువగా తినాలి. అలాగే మనం తినే ఆహారంలో కూరగాయలకు మరియు ఆకుకూరాలకు అధిక ప్రాధాన్యం ఇస్తే లివర్ ఆరోగ్యంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

Also Read:Vijay: ‘ఫ్యామిలీ స్టార్’ తో హిట్ కొడతాడా?

- Advertisement -