Tirupati: తొక్కిసలాట..రూ. 25 లక్షల పరిహారం

1
- Advertisement -

తిరుపతిలో తొక్కిసలాట మృతులకు రూ. 25 లక్షల పరిహారం అందించనున్నట్లు ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. తొక్కిసలాటలో ఆరుగురు చనిపోగా 48 మంది గాయాలపాలై ఆసుపత్రిలో చికిత్సపొందుతున్న విషయం తెలిసిందే.

క్షతగాత్రులను మంత్రులు అనిత, సత్యగాని ప్రసాద్ పరామర్శించారు. తిరుపతి ఘటన ప్రమాదమా.. కుట్రా అనే కోణంలో విచారణ చేపడుతామని వెల్లడించారు. ఎవరి వైఫల్యం ఉందో అనేది సీసీ కెమెరాల ద్వారా తెలుస్తుందని అన్నారు. బాధితులను అన్ని రకాలుగా ఆదుకుంటామని ప్రకటించారు.

బాధ్యులు ఏ స్థాయిలో ఉన్నా కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇలాంటి ఘటనలు భవిష్యత్తులో జరుగకుండా చూస్తామని పేర్కొన్నారు. మంత్రి నిమ్మల రామోహ్మన్‌నాయుడు మాట్లాడుతూ ఘటనపై సమగ్ర దర్యాప్తు చేపడుతామని, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందిస్తామన్నారు.

Also Read:డాకు మహారాజ్..ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు

- Advertisement -