2017లో హీరోయిన్ల సినిమాల లీస్ట్..

162
Telugu

2017 లో టాప్ హీరోయిన్లంతా పక్కా ప్లాన్ తో రంగంలోకి దూకుతున్నారు. కొత్త ఏడాది రాకతో ఈ భామలంతా ఇప్పటికే తాము చేయబోయే సినిమాల విషయంలో ఒక క్లారిటీకి వచ్చేశారు. ప్రస్తుతం చేతిలో ఉన్నసినిమాలే కాకుండా ఈ ఇయర్ మిడిల్ కల్లా మరిన్ని సినిమాలు ఈ భామల ఖాతాల్లోకి చేరనున్నాయి. ప్రస్తుతం చేతిలో ఉన్న సినిమాలను బట్టి చూస్తే.. నంబర్ వన్ పొజిషన్ లో ఉంది అనుష్క. గత ఏడాది స్వీటీ రెండు చిత్రాల్లో నటించినా.. అవి అతిథిపాత్రలే కావడంతో ఫ్యాన్స్ నిరూత్సాహపడ్డారు. అయితే ఈ ఏడాది మాత్రం అనుష్క అలా చేయడంలేదు. బాహుబలి కంక్లూజన్ లాంటి జాతీయస్థాయి సినిమా ఆమె చేతుల్లో ఉంది. ఏప్రిల్ 28 న విడుదల కాబోతున్న ఈ మూవీ అనుష్క కెరియర్ కు మరింత హైప్ తీసుకురానుందనడంలో ఎలాంటి సందేహంలేదు.

Telugu

ఇక ఈ మూవీకి కంటే ముందే స్వీటీ సూర్యతో కలిసి నటించిన సింగం 3 విడుదల కాబోతుంది. ఆ వెంటనే నాగ్ తో కలిసి చేస్తున్న భక్తిరస చిత్రం నమో వేంకటేశాయ విడుదల కానుంది. అయితే ఇందులో స్వీటీది ఫుల్ లెంగ్త్ పాత్ర కాదు. ఇక అనుష్క చేస్తున్న లేడీ ఒరియెంటెడ్ మూవీ భాగమతి ఇదే ఏడాది థియేటర్లలోకి రానుంది. మొత్తానికి కెరియర్ పరంగా చూస్తే.. ఈ ఏడాది ముద్దుగుమ్మ అనుష్క చాలా జోరు మీద ఉంది. అయితే 2017 సెకండాఫ్ లో అనుష్క డైరీ ఖాళీగా ఉన్నట్లే లెక్క. అప్పటిలోగా చేతిలో ఉన్న సినిమాలు పూర్తవుతాయి.

Telugu

అనుష్క తరువాత స్థానాన్ని కొట్టేసింది అందాల ముద్దుగుమ్మ కీర్తి సురేష్. ఈ ఏడాదితో కీర్తి రేంజ్ మారిపోవడం ఖాయం. అనుష్క తరువాత క్రేజీ ప్రాజెక్టులన్నీ ఈ భామ చేతిలోనే ఉన్నాయి. పవన్ కల్యాణ్, మహేష్ బాబు సినిమాల్లో నటిస్తోంది అమ్మడు. మరో వైపు నానితో నటించిన నేను లోకల్ మూవీ రిలీజ్ కు రెడీ అయ్యింది. మహానటి సావిత్రి బయోపిక్ మూవీలోనూ కీర్తి అవకాశం దక్కించుకుందని ఇప్పటికే వార్తలు వినిపిస్తున్నాయి. మొత్తానికి 2017 లో కీర్తి డైరీ ఖాళీ లేదనే చెప్పాలి. ఇక ఈ ఏడాది రకుల్ ప్రీత్ సింగ్ కూడా జోరు చూపిస్తోంది. ఈ అమ్మడి చేతిలో ఉన్న ఓకే ఒక భారీ చిత్రం మహేష్ బాబుతో చేస్తున్న సంభవామి. ఇది కాకుండా సాయి ధరమ్ తేజ విన్నర్ లో, బెల్లకొండ శ్రీనివాస్ తో బోయపాటి తెరకెక్కిస్తున్న ఓ మూవీలోనూ రకుల్ నటిస్తోంది. ఇవికాక మరోరెండు కథలు చర్చల దశలో ఉన్నాయి. అవి కూడా ఫైనల్ అయితే 2017లో రకుల్ కాల్షీట్లు దొరకడం కష్టమే.

Telugu

ఇక ఈ ఏడాది మిల్కీబ్యూటీ తమన్న చేతిలో ఉన్న ఒకే ఒక మూవీ బాహుబలి కంక్లూజన్. ప్రస్తుతం ఈ మూవీపైనే అమ్మడి ఆశలన్నీ ఉన్నాయి. బాహుబలి కంక్లూజన్ కెరియర్ ను మలుపు తిప్పే సినిమా అవుతుందని తమన్నా భావిస్తోంది. గత ఏడాది డల్ అయిపోయిన శృతి హాసన్ ఈ ఏడాది మాత్రం ఫుల్ జోష్ మీద ఉంది. 2017లో మాత్రం శ్రుతి తన దూకుడు చూపించడం ఖాయంగా కనిపిస్తోంది. కాటమరాయుడు చిత్రంతో పవన్ సరసన రెండోసారి జోడీ కట్టింది శృతి. ఉగాదికి ఈ చిత్రం రిలీజ్ కానుంది. ప్రస్తుతం కొత్త కథలు వింటున్న శ్రుతి తనకు తగిన పాత్రల కోసం ఎదురుచూస్తోంది. ఇక ఈ ఏడాది పెళ్లికి రెడీ అవుతున్న సమంత పరిస్థితి మరోలా ఉంది. ఇప్పటి వరకు సామ్ ఒక్క కొత్త సినిమానీ ఒప్పుకోలేదు. అయితే ఒక్కసారి మళ్లీ సినిమాలపై ఫోకస్‌ పెడితే ఈ బ్యూటీ తన జోరు చూపించడం ఖాయం. మొత్తానికి ఇవి 2017 లో టాప్ హీరోయిన్ల ప్రణాళికలు.

Telugu