రత్తాలుతో స్టెప్పులేసిన చెర్రీ…

121
Ram Charan Dance With Chiranjeevi Rathalu song

మెగాస్టార్ 150 వ సినిమా ఖైదీ నెంబర్ 150 . చిరంజీవి కెరీర్లో అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ఇది. ఈ సినిమా పై అభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. మెగా ఫ్యామిలీ మొత్తం సినిమా కోసం కష్టపడింది. చిరంజీవి తనయుడు రాంచరణే ఈ మూవీకి నిర్మాత. జనవరి 11న రిలీజ్ అవుతోన్న ఈ చిత్రంలో మెగా అభిమానులు ఫుల్ హ్యాపీగా ఫీలయ్యే విషయం ఒకటి ఉంది. మొదటి నుంచి ఈ సినిమాలో మెగా హీరోలందరూ కనిపిస్తారని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే.. ఈ వార్తల్లో నిజం లేదని చిత్ర యూనిట్ ఇదివరకే క్లారిటీ ఇచ్చేసింది. తొమ్మిదేళ్ల

గ్యాపులో చిరంజీవి అతిథి పాత్రలు చేశాడు. అది కూడా చరణ్ సినిమాల్లో మాత్రమే. ఇప్పుడు అదే సీన్ రీపీట్ అవుతుందని తెలుస్తోంది.అప్పుడు చరణ్ సినిమాల్లో చిరు తళుక్కుమని మెరిస్తే.. ఇప్పుడు150 మూవీలో చిరు పక్కన చరణ్ కూడా మెరవబోతున్నాడు. మూవీలోని రత్తాలు రత్తాలు అంటూ సాగే ఐటెం సాంగ్ లో చిరుతో కలిసి చరణ్ స్టెప్పులు వేశాడట. ఇప్పటికే విడుదలైన ఈ సాంగ్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. లారెన్స్ కొరియోగ్రఫీ ఈ పాటకు స్పెషల్ అట్రాక్షన్ కానుంది. అయితే కేవలం చరణ్ పాటలోనే కాకుండా సినిమాలో చిన్న పాత్రలో కూడా కనిపిస్తాడని చెబుతున్నారు.

ఈ సినిమాలో చరణ్ గెస్ట్ రోల్ చేశాడని ఇప్పటికే డైరెక్టర్ వివి వినాయక్ ప్రకటించాడు. మొత్తానికి రాంచరణ్ నిర్మాణ సారధ్యంలో మెగా ఫ్యామిలీ సినిమా కోసం కష్టపడింది. మెగా అభిమానుల్లో భారీ అంచనాలున్న ఖైదీ ఎలాంటి రికార్డులు సృష్టిస్తాడో చూడాలి మరీ.