దేశంలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు…

133

దేశంలో కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా పెరిగాయి. గత 24 గంటల్లో 43,263 కరోనా కేసులు నమోదుకాగా 338 మంది మృతిచెందారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,31,39,981కు చేరింది. కరోనా నుండి 3,23,04,618 మంది కోలుకోగా ప్రస్తుతం దేశంలో 3,93,614 కేసులు యాక్టివ్‌గా ఉండగా, 4,41,749 మంది బాధితులు కరోనాతో మృతిచెందారు.

దేశంలో మొత్తం 71,65,97,428 కరోనా వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేయగా గత 24 గంటల్లో 86,51,701 డోసులు ఉన్నాయని వైద్య,ఆరోగ్య శాఖ తెలిపింది. కొత్త కేసుల్లో అత్యధికంగా కేరళలో నమోదైనవే ఉన్నాయి. బుధవారం ఆ రాష్ట్రంలో 30,196 కేసులు నమోదవగా 181 మంది మృతిచెందారు.