నానిపై వస్తున్న రూమర్స్‌ అన్నీ ఫేక్!

512
nani
- Advertisement -

ఈ ఏడాది వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నాడు హీరో నాని. మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో నాని నటించిన వి సినిమా షూటింగ్ పూర్తికాగా కరోనా కారణంగా రిలీజ్ డేట్‌ ఆలస్యమైంది.

దీంతో పాటు శివ నిర్వాణ దర్శకత్వంలో టక్ జగదీష్, రాహుల్ సంక్రిత్యాన్ ద‌ర్శ‌క‌త్వంలో ‘శ్యామ్‌సింగ‌రాయ్’ సినిమాల్లో నటిస్తుండగా ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్‌లకి మంచిరెస్పాన్స్ వచ్చింది.

హరీష్ పెద్ది ,సాహు గారపాటి షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్న టక్ జగదీష్‌ సినిమాకు సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ సినిమాలో నానికి బైపోలార్ అనే సమస్యతో బాధపడుతుంటారని ప్రచారం జరుగుతుండగా వాటిని కొట్టిపారేసింది చిత్రయూనిట్. ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని…… నాని అదిరిపోయే ఎంటర్‌టైనింగ్ రోల్‌లో కనిపిస్తారని తెలిపింది చిత్రయూనిట్.

- Advertisement -