రఘు నందన్ రావు బంధువు ఇంట్లో 18 లక్షలు దొరికాయి- సీపీ

229
cp
- Advertisement -

సిద్దిపేట వ‌న్ టౌన్ పీఎస్ లో సీపీ జోయ‌ల్ డేవిస్ మీడియా స‌మావేశంలో మాట్లాడారు. ఈ రోజు విశ్వసనీయ సమాచారం మేరకు సిద్ధిపేటలో బీజేపీ అభ్యర్థి రఘు నందన్ రావు బంధువు సురభి అంజన్ రావు ఇంట్లో సోదాలు చేసామని సీపీ జోయల్ డెవిస్ తెలిపారు. దుబ్బాక ఉప ఎన్నికలో ఓటర్లను ప్రలోభాలకు గురిచేసేందుకు అంజన్ రావు ఇల్లు కేంద్రంగా ఉదయం నుండి డబ్బు పంపిణీ చేస్తున్నట్టు సమాచారం ఉంది. సిద్ధిపేట అర్బున్ మండల మెజిస్ట్రేట్ విజయ్ సాగర్ తో కలిసి సోదాలు చేశామన్నారు.

సురభి అంజన్ రావు ఇంటిలో 18లక్షల 67 వేల రూపాయలు దొరికాయి..అంజన్ రావు ను ప్రశ్నించగా తన బావ మరిది జితేందర్ రావు ఎన్నికల కోసం తన డ్రైవర్ ద్వారా డబ్బు పంపించినట్టు చెప్పారు. వాటిని స్వాధీనం చేసుకొని పోలీసు లు తహసీల్దార్ వస్తుండగా రఘునందన్ రావు,అతని అనుచరులు అడ్డుకున్నారు. పోలీసుల విధులకు ఆటంకం కలిగించారు. సురభి అంజన్ రావు ఇంటిలో స్వాధీనం చేసుకున్న 18 లక్షల 57 వేల రూపాయల నుండి 5 లక్షల 87 వేల రూపాయలు ఎత్తుకెళ్లారని సీపీ తెలిపారు.

డబ్బు ఎత్తుకెళ్లిన వారిపై కేసు నమోదు చేసాం..పోలీసు విధులకు,ఎన్నికల అధికారుల విధులకు ఆటంకం కలిగించిన వారిపై కూడా కేసు నమోదు చేసాం..డబ్బు ఎత్తుకెళ్లిన వారిని గుర్తించి అరెస్ట్ చేస్తామన్నారు. అంజన్ రావు ఇంటికి వెళ్లినప్పటి నుండి జరిగిన సోదాలను పూర్తిగా రికార్డు చేసాం.బీజేపీ నేతల ఫిర్యాదు మేరకు సిద్ధిపేట మున్సిపల్ చైర్మన్ రాజనర్సు ఇంట్లో కూడా సోదాలు చేశాం. అలాగే సురభి గోపాల్ రావు ఇంట్లో కూడా సోదాలు చేసామన్నారు. ఎన్నికల్లో ప్రశాంత వాతావరనాణానికి ఎవరు భంగం కలిగించినా.. ఓటర్లను డబ్బుతో ప్రలోభాలకు గురి చేయాలని చూసినా చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ జోయల్ డెవిస్ పేర్కొన్నారు.

- Advertisement -