నాయిని అహల్య మృతి…సీఎం కేసీఆర్ సంతాపం

67
kcr cm

మాజీ హోంమంత్రి దివంగత నాయిని నరసింహారెడ్డి సతీమణి నాయిని అహల్య నరసింహారెడ్డి మృతి ప‌ట్ల సంతాపం తెలిపారు సీఎం కేసీఆర్. సీఎంతోపాటు హోంమంత్రి మ‌హ‌మూద్ అలీ, మంత్రులు నిరంజ‌న్ రెడ్డి, అజ‌య్ కుమార్, శ్రీనివాస్ గౌడ్‌, ఎర్ర‌బెల్లి దయాక‌ర్ రావు, సబితా ఇంద్రారెడ్డి ప‌‌లువురు ప్ర‌జాప్రతినిధులు తమ సంతాపం ప్ర‌క‌టించారు.కరోనా పాజిటివ్ రావటం తో నాయిని నర్సింహ రెడ్డితో పాటే ప్రైవేట్ హాస్పిటల్ లో చేరారు అహల్య.

కరోనా నెగటివ్ వచ్చినా ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ తో చికిత్స పొందిన అహల్య భర్త నాయిని నర్సింహ రెడ్డి మృతి తో ఆఖరి చూపుకు అహల్య ను అంబులెన్స్ లో తీసుకొచ్చారు కుటుంబ సభ్యులు. తాజాగా ఆమె మృతితో కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.