ప్రకాశ్ రాజ్ దమ్మున్నోడు: నాగబాబు

51
naga babu

ప్రకాశ్‌ దమ్మున్నోడని…ఆయన గెలుపుకోసం కృషిచేస్తామని తెలిపారు మెగాబ్రదర్ నాగబాబు. మా ఎన్నికల నేపథ్యంలో జరుగుతున్న పరిణామాలపై స్పందించిన నాగబాబు.. ప్రకాశ్‌రాజ్‌కు మేము నూరు శాతం మద్దతిస్తాం అన్నారు. ఇంకో రెండు టర్మ్‌లు ఆయనే ‘మా’కు అధ్యక్షుడిగా ఉండాలన్నారు.

తాను బీజేపీ సానుభూతిపరుణ్ణి… ప్రకాశ్‌రాజ్‌ కమ్యూనిస్ట్‌ భావాలు కలిగిన వ్యక్తి. అయినా మద్దతు తెలుపుతున్నామంటే ఆయన మంచితనమే కారణం అన్నారు. ప్రకాశ్‌రాజ్‌ తెలుగువాడు కాదు అంటున్నారు…తెలుగు నటులు ఇతర భాషల్లో నటించలేదా అని ప్రశ్నించారు.

అవసరమైతే బీజే పీ ప్రభుత్వం, నరేంద్రమోదీతో మాట్లాడి ఏదైనా తేగలిగే దమ్మున్నోడు ప్రకాశ్‌రాజ్‌ అన్నారు. గతంలో మేం నరేష్‌ ప్యానల్‌కు సపోర్ట్‌ చేశాం. మా వల్ల గెలిచారని అనను. కానీ మా మద్దతు అయితే అతనికి ఉందన్నారు. పవన్‌ ఏమైనా బయటి వ్యక్తా. టాలీవుడ్‌ హీరో కాదా? అని మంచు విష్ణుని ప్రశ్నించారు నాగబాబు. ఓటుకు రూ. 10 వేలు ఇచ్చారనీ త్వరలో మరింత ముట్టచెబుతామని హామీ ఇస్తున్నారంటూ వార్తలొస్తున్నాయని ఇది మంచిపద్దతి కాదన్నారు.