స్వల్ప లక్ష్యం..చేతెలెత్తేసిన ఆర్సీబీ

59
srh

ఐపీఎల్ 2021లో ఆర్సీబీ ఘోర పరాజయం పాలైంది. స్వల్ప లక్ష్యాన్ని కూడా చేధించలేక హైదరాబాద్ ముందు చతికిలబడిపోయింది. దీంతో బెంగళూరుపై హైదరాబాద్ 4 పరుగుల తేడాతో విజయం సాధించింది.

142 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కొల్పోయి 137 పరుగులు మాత్రమే చేసింది. ఆరంభంలోనే కోహ్లీ వికెట్ కొల్పోయిన తర్వాత మాక్స్‌వెల్ (40: 25 బంతుల్లో 3×4, 2×6), దేవదత్ పడిక్కల్ (41: 52 బంతుల్లో 4×4) నిలకడగా ఆడటంతో.. బెంగళూరు అలవోకగా గెలిచేలా కనిపించింది. కానీ.. చివర్లో భువి చక్కని బౌలింగ్ ప్రదర్శనతో జట్టును గెలిపించాడు. చివరి 6 బంతుల్లో 13 పరుగులు కావాల్సిఉండగా 8 పరుగులే ఇచ్చి హైదరాబాద్‌ని గెలిపించాడు.

అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన ఎస్‌ఆర్‌హెచ్‌ 20 ఓవర్లలో 7 వికెట్లు కొల్పోయి 141 పరుగులు చేసింది. ఓపెనర్ జేసన్ రాయ్ (44: 38 బంతుల్లో 5×4), కెప్టెన్ కేన్ విలియమ్సన్ (31: 29 బంతుల్లో 4×4)రాణించారు.