కనకరాజుకు రూ.10 వేల పెన్షన్‌: శ్రీనివాస్ గౌడ్

142
srinivas goud
- Advertisement -

రాష్ట్ర ఆబ్కారి, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీ V. శ్రీనివాస్ గౌడ్ గారితో హైదరాబాద్ లోని రవీంద్రభారతిలో ని తన కార్యాలయంలో రాజ్ గోండు గిరిజనుల ప్రత్యేక నాట్య కళ గుస్సాడీ లో అపార నైపుణ్యం గడించిన కుమురం భీమ్ అసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలం మర్లవాయి గ్రామానికి చెందిన గుస్సాడీ రాజు కనకరాజు సేవలను గుర్తించి కేంద్ర ప్రభుత్వం పద్మ శ్రీ అవార్డు ప్రకటించిన అనంతరం మర్యాద పూర్వకంగా భేటి అయ్యారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆదివాసీ గుడేల్లో మాత్రమే కనిపించే గుస్సాడీ నృత్యం ఒక విశిష్టమైన కళ అని మంత్రి అభివర్ణించారు. ఆదివాసీ నృత్యం గుస్సాడీ ని కొత్త తరానికి అందిస్తున్న కనకరాజు సేవలను గుర్తించి పద్మ శ్రీ పురస్కారం ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ ప్రాచీన నృత్యం పై మైదాన ప్రాంతాల్లో ని వారికి అవగాహన తక్కువ అన్నారు. వందల ఏళ్ల నుంచి ఈ ప్రాచీన దేవతా కళ తరతరాలు దాటుకుంటూ ప్రస్తుత రోబోటిక్ యుగంలోనూ కోనసాగుతోందన్నారు. గుస్సాడీ నాట్యానికి మెరుగులు దిద్దటమే కాకుండా నేటి తరానికి శిక్షణ ఇస్తూ మరింత గొప్ప కళ గా తీర్చిదిద్దుతున్న శ్రీ కనకరాజు గారిని మంత్రి శ్రీ V. శ్రీనివాస్ గౌడ్ గారు ఈ సందర్భంగా అభినందించి, ఘనంగా సన్మానించారు.

పద్మ శ్రీ పురస్కారం పొందిన శ్రీ కనకరాజు గారి సేవలకు గుర్తుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరుపున కళాకారుల కు అందించే 10 వేల రూపాయల ప్రత్యేక పెన్షన్ ను అందించేందుకు రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు రావు గారి దృష్టికి తీసుకెళ్లి అమలు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సాంస్కృతిక సంచాలకులు మామిడి హరికృష్ణ, కనకరాజు బృందం సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -