- Advertisement -
మాస్క్ ధరించకపోతే వెయ్యి రూపాయల నిబంధన ఉందని…ఈ ఫైన్ కఠినంగా ఇంప్లిమెంట్ చేస్తామని తెలిపారు డీహెచ్ శ్రీనివాస్ రావు. ఇప్పటివరకు 99 శాతం మంది మొదటి డోస్ తీసుకున్నారని…ఇంకా 25లక్షల మంది రెండో డోస్ తీసుకోలేదని తెలిపారు. వ్యాక్సిన్ తీసుకొక పోతే ఆత్మ హత్య చేసుకున్నట్లు లెక్క అని తెలిపిన శ్రీనివాస్ రావు..ఈ రోజు నుండి అన్ని ప్రయాణాల్లో వ్యాక్సిన్ తీసుకున్న సర్టిఫికెట్ అందుబాటులో పెట్టుకోవాలన్నారు.
హెల్త్ సిబ్బంది ఇవ్వాళ్టి నుండి చెక్ చేస్తారు…వ్యాక్సిన్ తీసుకున్నారా లేదా అనేది…ఇది మీకు మొదటి ప్రమాద హెచ్చరిక అన్నారు. యుకే నుండి హైదరాబాద్ కు ట్రావెల్ చేసిన మహిళ ది రంగారెడ్డి జిల్లా అని ఆమెను టీమ్స్‌లో అబ్జర్వేషన్లో పెట్టామన్నారు. ప్రతి ఒక్కరూ జాగ్రత్త వహించాలన్నారు.
- Advertisement -