Virat Kohli:సంపాదనెంతో తెలుసా?

65
- Advertisement -

టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ సంపాదనెంతో తెలుసా? అక్షరాల రూ.1,050 కోట్లు. ఈ విషయాన్ని స్టాక్ గ్రో వెల్లడించింది. 34 ఏళ్ల కోహ్లీ … ఐపీఎల్,వివిధ కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్‌గా,ఇన్‌స్టాగ్రామ్‌, ట్విట్టర్ ద్వారా సంపాదన ఆర్జిస్తున్నారు.

టీమిండియా కాంట్రాక్ట్‌లో ‘ఎ ప్లస్’ ఆటగాడిగా రూ. 7 కోట్లు ఆర్జిస్తున్నాడు. ప్రతి టెస్టు మ్యాచ్‌కు రూ. 15 లక్షలు, వన్డేకి రూ. 6 లక్షలు, టీ20కి రూ. 3 లక్షల చొప్పున అందుకుంటున్నాడు. ఇక ఐపీఎల్‌లో ఆర్సీబీ తరపును ప్రాతినిధ్యం వహిస్తున్న కోహ్లీ ఏడాదికి రూ. 15 కోట్లు అందుకుంటున్నారు.

Also Read:హ్యాపీ ఫాదర్స్‌ డే…

అలాగే ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్టుకు రూ. 8.9 కోట్లు, ట్వీట్‌కు రూ. 2.5 కోట్లు వసూలు చేస్తున్నాడు. 18కిపైగా బ్రాండ్లకు ప్రచారకర్తగా ఉన్న కోహ్లీ ఏడాదికి రూ. 7.50 కోట్ల నుంచి రూ. 10 కోట్లు సంపాదిస్తున్నాడు. ఇలాంటి బ్రాండ్ల ఎండార్స్‌మెంట్ల ద్వారా దాదాపు రూ. 175 కోట్లు ఆర్జిస్తున్నాడు. ముంబైలో అతడికున్న ఇంటి విలువ రూ. 34 కోట్లు కాగా, గురుగ్రామ్‌లోరూ. 80 కోట్ల విలువ చేసే ఇల్లు ఉంది. రూ. 31 కోట్ల విలువైన లగ్జరీ కార్లు ఉన్నాయి.

Also Read:డబ్బులు తీసుకోకుండా ఓటు వేయాలి: విజయ్

- Advertisement -