Sudheer17:మానాన్న సూపర్‌ హీరో

40
- Advertisement -

సమ్మోహనంతో క్రేజీ హీరోగా పేరు తెచ్చుకున్నారు సుధీర్ బాబు. రీసెంట్‌గా హంట్, మామ మశ్చీంద్ర సినిమాతో వచ్చిన అవి ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేదు. ఈ నేపథ్యంలో తాజాగా మా నాన్న సూపర్ హీరో అంటూ ప్రేక్షకుల ముందుకువస్తున్నారు.

ప్రస్తుతం సుధీర్‌ చేతిలో ఇప్పుడు మూడు సినిమాలుండగా అందులో యూవీ సంస్థలో తెరకెక్కుతున్న సినిమాకు మా నాన్న సూపర్ హీరో అనే టైటిల్ ఖరారు చేశారు. అభిలాష్‌ కంకర దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటుంది. . జై క్రిష్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను కామ్ ఎంటర్‌టైనమెంట్స్‌ బ్యానర్‌పై సునీల్ బలుసు నిర్మిస్తున్నారు.

Also Read:హ్యాపీ ఫాదర్స్‌ డే…

లేటెస్ట్‌గా రిలీజైన పోస్టర్‌ ప్రేక్షకులను తెగ ఆకట్టుకుంటుంది. పోస్టర్‌లో కేరళ స్టేట్ లాటరీ అంటూ కోటి రూపాయలు లాటరీని ఒకరు గెలుచుకున్నట్లు ఓ ఫ్లెక్స్‌ను పెట్టారు. ఇది సినిమాపై మరింత క్యూరియాసిటీ పెంచింది.

Also Read:దశాబ్ది ఉత్సవాలు..తెలంగాణ హరితోత్సవం

- Advertisement -