‘ఆర్ఆర్ఆర్’ విడుదలకు ముహుర్తం ఖరారు..

27
rrr

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్, మెగా పవర్‌స్టార్‌ రామ్ చరణ్‌ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఆర్ఆర్ఆర్’(రౌద్రం రణం రుథిరం) పే. ఈ మూవీ నుండి తాజా అప్ డేట్ వచ్చింది. భారీ తారాగణంతో రూపుదిద్దుకున్న ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 7న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ విషయాన్ని దర్శకుడు రాజమౌళి సోషల్ మీడియాలో ప్రకటించారు. 07.01.2022 ఆర్ఆర్ఆర్ విడుదల తేదీ ఇదేనంటూ వెల్లడించారు. దీనికి సంబంధించిన ఆసక్తికరమైన పోస్టర్ ను కూడా రాజమౌళి పంచుకున్నారు. ఈ మూవీ తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళం భాషల్లో విడుదల కానుంది.

ఇప్పటికే ఓసారి విడుదల వాయిదా పడిన ఈ చిత్రం ఈ సారి పక్కా అంటూ చిత్రబృందం పేర్కొంది. డీవీవీ ఎంటర్‌టైన్మెంట్‌ పతాకంపై భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కీరవాణి సంగీతం అందించిన ఈ సినిమాలో ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు తెలుగు చారిత్రక వీరులైన కొమరం భీమ్, అల్లూరి సీతారామ రాజు పాత్రలు చేస్తున్నారు. వీరికి జంటగా హాలీవుడ్‌ నటీ ఒలివియా మోరీస్, బాలీవుడ్‌ నటి అలియా భట్ నటిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగణ్ ఈ చిత్రంలో ఓ కీలక పాత్రలో కనిపిస్తారు.