‘ఇదే మా కథ’ మూవీ రివ్యూ

134
Idhe Maa Katha

సుమంత్‌ అశ్విన్, శ్రీకాంత్, భూమిక, తాన్యా హోప్‌ ముఖ్య పాత్రల్లో గురు పవన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఇదే మా కథ’. జి. మహేష్‌ నిర్మించిన ఈ సినిమా శనివారం (అక్టొబర్‌ 2)న థియేటర్ల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఆ చిత్రం ఎలా ఎందో రివ్యూలో చూద్దాం.

కథ: అజయ్ (సుమంత్ అశ్విన్).. అజయ్-అడ్వెంచర్స్ యూట్యూబర్‌గా ప్రతీది రికార్డ్ చేసి యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేస్తుంటాడు. బైక్‌పై అడ్వంచర్స్ చేసి నేషనల్ ఛాంపియన్ అవ్వాలనే డ్రీమ్‌తో ఉండే అజయ్ లోకల్‌‌గా జరిగే ప్రతి పోటీలో ఓడిపోతుంటాడు. అజయ్‌‌పై ఎన్నో ఆశలు పెట్టుకున్న తండ్రి (శ్రీకాంత్ అయ్యంగార్).. అతని ఓటములను తట్టుకోలేక అడ్వంచర్స్ మానుకుని బిజినెస్ లేదంటే బుద్దిగా చదువుకోమంటాడు. తండ్రి మాటను లెక్క చేయకుండా.. ల‌ద్దాఖ్‌లో జరిగే ఇంటర్నేషనల్ అడ్వంచర్ రేస్‌కి పయనమవుతాడు.

ప్లస్ పాయింట్స్‌: క‌థా నేప‌థ్యం.. శ్రీకాంత్‌, భూమిక న‌ట‌న‌.. ద్వితీయార్ధం ఈ చిత్రానికి ప్రధాన బలం అని చెప్పాలి. డైలాగ్స్ కొన్ని చోట్ల పర్వాలేదనిపిస్తాయి.

మైనస్ పాయింట్స్‌: కథ విషయంలో ఏమాత్రం కొత్తదనం లేకపోవడం మైనస్ అయ్యింది. ఇక రైటర్ కమ్ డైరెక్టర్ గురు పవన్ విషయానికి వస్తే.. అతను రైటింగ్ దగ్గరే తేలిపోయాడు. ప్రధాన పాత్రలను చాలా సాధారణంగా తీర్చిదిద్దడం.. ఇక దర్శకుడిగానూ అతనేమీ మెరుపులు చూపించలేదు.

సాంకేతిక విభాగం: టెక్నికల్ గానూ ‘ఇదే మా కథ’ చాలా వీక్ గా కనిపిస్తుంది. సునీల్ కశ్యప్ పాటల్లో ఒక్కటీ వినసొంపుగా లేవు. కథకు కీలకమైన ఎమోషనల్ సాంగ్ కూడా అంతగా ఆకట్టుకోదు. నేపథ్య సంగీతం కూడా మామూలుగా అనిపిస్తుంది. రామ్ ప్రసాద్ ఛాయాగ్రహణం పాత శైలిలో సాగింది. రోడ్ ట్రిప్ నేపథ్యంలో సినిమా అంటే మంచి విజువల్స్ ఆశిస్తాం కానీ.. ఇందులో అలాంటి ఆకర్షణలేమీ లేవు. నిర్మాణ విలువలు పర్వాలేదు.

తీర్పు: రోడ్ ట్రిప్ సినిమాల్లో ప్రయాణం సాగే కొద్దీ పాత్రల్లో ఒక పరివర్తన రావడం.. ప్రేక్షకులు ఎమోషనల్ గా కదిలించే ప్రయత్నం జరగడం చూస్తుంటాం. కానీ ఇందులో డైలాగుల ద్వారా ఎమోషన్ తెప్పించే ప్రయత్నం జరిగింది తప్ప.. అది ప్రేక్షకులు ఫీలయ్యేలా లేదు. సినిమా మొత్తంలో కొత్తగా ఉందనిపించే సన్నివేశం ఒక్కటీ లేదు. పాత్రలతో ఎమోషనల్ కనెక్ట్ లేకపోవడం వల్ల ఈ ప్రయాణం ఆద్యంతం భారంగా అనిపిస్తుంది. చివరగా ఎలాంటి అనుభూతి లేకుండా థియేటర్ల నుంచి బయటికి వస్తాం.. అక్కడక్కడా మెప్పించే నలుగురి ‘ఇదే మా కథ’

విడుదల తేదీ: 02, అక్టోబర్ 2021
రేటింగ్ : 2.5/5
నటీనటులు : శ్రీకాంత్‌, సుమంత్‌ అశ్విన్‌, భూమిక, తాన్యా హోప్‌
సంగీతం: సునీల్ కశ్యప్
నిర్మాత: జి. మహేష్
కథ, స్ర్కీన్‌ప్లే, దర్శకత్వం: గురు పవన్