మా ఎన్నికలు: పూనమ్‌ కౌర్‌ సంచలన కామెంట్స్

73

మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ (మా) ఎన్నిక బరిలో అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న ప్రకాశ్‌రాజ్‌ విజయం సాధించాలని తాను కోరుకుంటున్నట్టు నటి పూనమ్‌ కౌర్‌ ట్వీట్‌ చేశారు. ఈ నటి ఇటీవల ప్రకాశ్ రాజ్‌తో తాను దిగిన ఫోటోను పోస్ట్ చేస్తూ మా ఎన్నికల్లో ఆయనే గెలవాలి అని కోరుకుంటున్నాను అని మనసులోని మాట బయటపెట్టారు. ఆయన విజయం సాధిస్తే ఇంతకాలం నేను ఎదుర్కొన్న సమస్యల్ని బయటపెడతా. ఆయన చిల్లర రాజకీయాలు చేయరు అని స్టేట్‌మెంట్ కూడా ఇచ్చారు.

పెద్దలపై గౌరవంతో వాళ్లు చెప్పింది శిరసావహిస్తానని ఆమె తెలిపారు. మరి నిజంగానే ప్రకాశ్ రాజ్ అధ్యక్షుడిగా గెలిస్తే పూనమ్ ఏ విషయాలను బయటపెట్టనుంది? ఇండస్ట్రీలోని ఎంతమందిపై పూనమ్ ఆరోపణలు చేయనుంది? అనేది ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. పూనమ్ కౌర్.. చేసింది తక్కువ సినిమాలే అయినా ఎక్కువగా కాంట్రవర్సీలతో వార్తల్లో నిలుస్తోంది ఈ భామ.