ఆర్ఆర్ఆర్..బీస్ట్ మోడ్‌లో ఎన్టీఆర్‌

102
rrr
- Advertisement -

టాలీవుడ్‌ దర్శకధీరుడు ఎస్‌ ఎస్‌ రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా రూపుదిద్దుకుంటున్న చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రమోషన్స్‌ ముమ్మరం చేసింది.

అందులో భాగంగా “కొమరం భీమ్ ఫర్ ఆర్ఆర్ఆర్” అంటూ ఎన్టీఆర్ కు సంబంధించిన ఓ పోస్టర్ రిలీజ్ చేశారు. అందులో ఎన్టీఆర్ రౌద్రంగా బీస్ట్ మోడ్ లో కనిపిస్తున్నాడు. ఈ పోస్టర్ చూస్తుంటే ఎన్టీఆర్ సినిమాలోని యాక్షన్ సన్నివేశాల్లో ఎంత అద్భుతంగా నటించాడో బాగా అర్థమవుతుంది.

ఇక సినిమాపై ఆసక్తి, అంచనాలని పెంచే “కొమరం భీమ్ ఫర్ ఆర్ఆర్ఆర్” పోస్టర్ తో ఎన్టీఆర్ అభిమానులను థ్రిల్ చేసిన “ఆర్ఆర్ఆర్” టీం ఈరోజు సాయంత్రమే మరో కొత్త పోస్టర్ ను రిలీజ్ చేయనుంది. సాయంత్రం 4 గంటలకు రామ్ చరణ్ పోస్టర్ విడుదల కానుంది. చ సోషల్ మీడియాలో “కొమరం భీమ్ ఫర్ ఆర్ఆర్ఆర్” అనే హ్యాష్ ట్యాగ్ ను ట్రెండ్ చేస్తున్నారు ఫ్యాన్స్.

- Advertisement -