దుబాయ్‌లో ఆర్ఆర్ఆర్ టీం..!

49
rrr

దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా తెరకెక్కుతున్న చిత్రం ఆర్ఆర్ఆర్. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం అక్టోబర్ 13న విడుదల కానుంది. ఇప్పటికే సినిమా ప్రమోషన్‌ ఓవైపు చేస్తూనే మరోవైపు షూటింగ్‌ని శరవేగంగా కంప్లీట్ చేస్తోంది చిత్రయూనిట్.

రాబోయే షెడ్యూల్‌ ను యూరప్‌లో చిత్రికరించనున్నారు. ఇందుకోసం త్వరలోనే ఆర్ఆర్ఆర్ టీం మొత్తం యూరోప్ కు ప్రయాణం కానుంది. ఈ యూరోప్ షెడ్యూల్ పూర్తయిన తర్వాత యూనిట్ హైదరాబాద్‌కు తిరిగి వస్తుంది. ఆగస్టు చివరి వరకు ఈ షెడ్యూల్ కొనసాగే అవకాశం ఉంది. దీనితో మొత్తం షూటింగ్ ప్రక్రియ పూర్తవుతుంది.

షూటింగ్ పూర్తయిన తర్వాత యూనిట్ శరవేగంగా ప్రమోషన్‌లను ప్రారంభిస్తుంది. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.