గ్రీన్ ఛాలెంజ్‌లో పాల్గొన్న మీరాబాయ్ చాను..

67
green

ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొన్నారు టోక్యో ఒలింపిక్స్‌లో రజత పతాకం సాధించిన మీరా బాయ్ చాను. వెయిట్ లిఫ్టింగ్‌ 49 కేజీల విభాగంలో మీరాబాయి రజతం సాధించి భారత్‌కు తొలి పతాకం అందించగా పర్యావరణ పరిరక్షణలో భాగంగా తనవంతుగా ఎంపీ సంతోష్ చేపట్టిన గ్రీన్ ఇండిచా ఛాలెంజ్‌ కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటారు.

మణిపూర్‌లోని తన నివాసంలో మొక్కలు నాటిన మీరాబాయి…ప్రతి ఒక్కరూ విధిగా ఈ కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటాలని సూచించారు. ఇక గ్రీన్ ఛాలెంజ్‌లో పాల్గొన్న మీరాబాయిని అభినందనించారు ఎంపీ సంతోష్. ఒలింపిక్స్‌లో రజత పతాకం సాధించి భారతీయుల హృదయాలను గెలవడమే కాదు …మొక్కలు నాటడం ద్వారా మంచి సందేశాన్ని ఇచ్చారని పేర్కొన్నారు. మొక్కలు నాటడం ద్వారా మీరాబాయి మరింత మంది ఈ కార్యక్రమంలో పాల్గొనేలా ఆదర్శంగా నిలిచారన్నారు.