అల్లూరికి ఆర్ఆర్ఆర్‌ నివాళి

470
alluri sitaramaraju
- Advertisement -

దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్,జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా తెరకెక్కుతున్న మల్టీస్టారర్ ఆర్ఆర్ఆర్. 2020 జూలై 30న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుండగా తాజాగా అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా ఆర్ఆర్ఆర్ మూవీ ట్వీట్ చేసింది.

యవ్వనంలో ఉన్న రామరాజుగా రామ్ చరణ్ ను తెరపై చూపించేందుకు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నామని చిత్ర యూనిట్ తెలిపింది. అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా ఆ మహనీయుడిని స్మరించుకుంటున్నట్టు పేర్కొంది చిత్రయూనిట్.

ఇప్పటి వరకు రాజమౌళి చేసిన సినిమాల్లో భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న సినిమా ఆర్ఆర్ఆర్ కావడం విశేషం. చరణ్‌ అల్లూరి సీతారామరాజుగా కనిపిస్తుండగా, ఎన్టీఆర్‌ కొమరం భీం పాత్రలో అలరించనున్నాడు.

- Advertisement -