ఆర్ఆర్ఆర్…ఎన్టీఆర్ లుక్ వైరల్!

221
ntr
- Advertisement -

దర్శకధీరుడు రాజమౌళి ప్రస్తుతం ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా ‘ఆర్ఆర్ఆర్’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు తెలుగులో ‘రౌద్రం రణం రుధిరం’ అనే టైటిల్ ఖరారు చేయగా సారు. చరిత్రలో ఎన్నడు కలవని ఇద్దరు చారిత్రక యోధులైన ఆంధ్రా ప్రాంతానికి చెందిన అల్లూరి సీతారామరాజు, తెలంగాణకు చెందిన కొమరం భీమ్‌లు ఒకవేళ కలిస్తే ఎలా ఉంటుందో అనే కాల్పనిక కథతో.. రాజమౌళి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. డీవీవీ దానయ్య భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాలో పలువురు హాలీవుడ్ స్టార్స్ తో పాటు బాలీవుడ్ స్టార్స్ అజయ్ దేవగన్ – అలియా భట్ కూడా నటిస్తున్నారు.

అల్లూరిగా చరణ్ నటిస్తుండగా కొమరం భీమ్ గా నటిస్తున్నాడు ఎన్టీఆర్. ఈ నెల 22 న భీమ్ టీజర్ రానున్నట్లు ప్రకటించింది చిత్రయూనిట్. అప్పటి నుంచి ఎన్టీఆర్ అభిమానులంతా తారక్ లుక్ కోసం వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు.

తాజాగా ఎన్టీఆర్ ఫోటో సిక్స్ ప్యాక్ లుక్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రముఖ ఫోటోగ్రాఫర్ డబ్బో రత్నాన్ని ఎన్టీఆర్ తో ఫోటో షూట్ నిర్వహిస్తున్న సమయంలో తీసినది ఈ ఫోటో . ఎన్టీఆర్ లుక్ చూసి అభిమానులు ఫిదా అయిపోతున్నారు.

- Advertisement -