భారీ రేటుకు ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ఆడియో రైట్స్‌..

113
- Advertisement -

దర్శకధీరుడు ఎస్‌ ఎస్‌ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం రౌద్రం రణం రుధిరం (ఆర్ఆర్ఆర్). ఈ చిత్రాన్ని డి.వి.వి దానయ్య భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ కీలక పాత్రధారులుగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాకి కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు. తాజాగా ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమా ఆడియో రైట్స్‌ను తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో టీ–సిరీస్‌, లహరి మ్యూజిక్‌ సంస్థలు దక్కించుకున్నాయి. ఈ విషయాన్ని సోమవారం అధికారికంగా ప్రకటించారు.

భూషణ్‌కుమార్‌ మాట్లాడుతూ ‘‘రాజమౌళి, కీరవాణి కాంబినేషన్‌ అంటే మాకెంతో ఇష్టం. వారి పనిని మేం ఎప్పుడూ గౌరవిస్తాం. దేశ వ్యాప్తంగా ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమా ఆడియో రైట్స్‌ దక్కించుకోవడం చాలా ఆనందంగా ఉంది. పాటలు, సినిమా అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నా’’ అని అన్నారు.

రామ్ చరణ్ “అల్లూరి సీతారామరాజు” పాత్రలో, జూనియర్ ఎన్టీఆర్ “కొమరం భీమ్” పాత్రలో కనిపించబోతున్నారు. దాదాపుగా షూటింగ్ ని పూర్తి చేసుకున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులను మొదలుపెట్టనుంది. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు అజయ్‌ దేవగణ్‌, శ్రియ, ఆలియాభట్‌ తదితరులు నటిస్తున్నారు. ఈ సినిమా అక్టోబర్ 13న విడుదల కానుంది.

- Advertisement -