మళ్ళీ షూటింగ్‌ షురూ చేసిన ‘పుష్ప’రాజ్‌..

61

అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘పుష్ప’ . ఈ సినిమాలో అల్లు అర్జున్ లారీ డ్రైవర్ ఎర్ర చందనం స్మగ్లర్ పుష్ప రాజ్ పాత్రలో కనిపించనున్నారు. రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమా, చాలావరకూ చిత్రీకరణను జరుపుకుంది. ఓ నెలరోజుల పాటు చిత్రీకరణ జరిపితే ఈ సినిమా షూటింగు పార్టును పూర్తి చేసుకుంటుంది. హైదరాబాద్.. మారేడుమిల్లి ప్రాంతాల్లో షూటింగును ప్లాన్ చేశారు.

అయితే హైదరాబాదులో షూటింగు జరుగుతూ ఉండగానే ఆపేశారు. వర్షాల కారణంగా సెట్ దెబ్బతినడం వలన అనీ, సుకుమార్ కి ఫీవర్ వచ్చిందని చెప్పుకున్నారు. సుకుమార్ కి ఫీవర్ రావడం నిజమేనట. ఇప్పుడు పూర్తిగా కోలుకున్న ఆయన, ఈ రోజున షూటింగును మొదలుపెట్టేసినట్టుగా చెబుతున్నారు. అల్లు అర్జున్ కాంబినేషన్లోని సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారట. త్వరలోనే ఈ సినిమా షూటింగులో ఫాహద్ ఫాజిల్ జాయిన్ కానున్నాడు. ఆయన పాత్రను డిజైన్ చేసిన తీరు చాలా కొత్తగా ఉంటుందని అంటున్నారు. అడవి నేపథ్యంలో .. అనూహ్యమైన మలుపులతో ఈ కథ నడుస్తుంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం ఈ సినిమాకి హైలైట్ గా నిలవనుందని అంటున్నారు. ఈ ఏడాదిలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.