Oscar:ప్రౌడ్‌ మూమెంట్‌.. జ్యూరీలో ఆర్ఆర్ఆర్ టీం..

48
- Advertisement -

సినీ వినీలాకశంలో ఆస్కార్ అవార్డు రావడమంటే నోబెల్ ఫ్రైజ్ సాధించిన గౌరవం లభిస్తుంది. అయితే ఈ యేడాది ఆరంభంలో ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు గెలుచుకున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా మరోసారి తెలుగు చిత్ర పరిశ్రమపై ప్రపంచ చిత్రపరిశ్రమ కన్ను పడింది.

ద అకాడమీ ఆఫ్ మోషనల్ పిక్చర్స్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ కొత్తగా ఆస్కార్ కమిటీలో 398మందికి సభ్యత్వం కల్పించింది. ఆ జాబితాను తాజాగా విడుదల చేసింది. ఇందులో ఆర్ఆర్ఆర్ టీంకు చెందిన వ్యక్తులు ఆరుగురు ఉండటం విశేషం. ఇందులో జూ.ఎన్టీఆర్, రామ్‌చరణ్, సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి, గేయ రచయిత చంద్రబోస్‌, ఛాయాగ్రాహకుడు సెంథిల్, ప్రొడక్షన్ డిజైనర్ సాబు సిరిల్‌ ఉన్నారు. ఇక బాలీవుడ్ నుంచి కరణ్‌జోహార్‌కు కూడా స్థానం లభించింది.

Also Read: సైంధవ్ కీలక షెడ్యూల్ పూర్తి..

ఆస్కార్ జ్యూరీ మెంబర్లుగా తారక్, చరణ్ లకు స్థానం లభించడంతో మెగా, నందమూరి అభిమానులు పండగ చేసుకుంటున్నారు. సోషల్ మీడియా ద్వారా నటులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇదే సమయంలో దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి పేరు లిస్టులో లేకపోవడంతో అభిమానులు నిరాశకు గురవుతున్నారు. ఎంతో కృషి చేసిన జక్కన్నకు ఈ గౌరవం దక్కి ఉంటే బాగుండేది అంటూ ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. కొత్తగా చేరిన మెంబర్స్‌తో కలిపి ప్రపంచవ్యాప్తంగా అకాడమీ జ్యూరీ లిస్టులో 10,817 మంది ఉన్నారు. 96వ అకాడమీ అవార్డ్స్‌లో 9375మంది మాత్రమే ఓటు వేయబోతున్నట్టు తెలుస్తోంది. గతేడాది విడుదలైన ఆర్ఆర్ఆర్ సినిమా బాక్సాఫీస్ వద్ద కాసుల సునామీ సృష్టించిన సంగతి తెలిసిందే.

Also Read: పవన్ ‘బ్రో’కి ఇబ్బందులు తప్పవా?

- Advertisement -