‘ఆర్‌ఆర్‌ఆర్‌’ అప్‌డేట్..!

97
rrr

ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా దర్శకుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి రూపొందిస్తున్న ఈ చిత్రం ఆర్‌ఆర్‌ఆర్‌. గత కొంత కాలంగా కరోనా నేపథ్యంలో సినిమా షూటింగ్‌ వాయిదా పడిన విషయం తెలిసిందే. ఇటీవల కేంద్ర ప్రభుత్వ సినిమా షూటింగ్‌లకు అనుమతి ఇచ్చింది. దీంతో జక్కన్న ట్రిపుల్‌ ఆర్‌ షూటింగ్‌కు రెడీ అవుతున్నాడట. నవంబర్ నుంచి షూటింగ్ ప్రారంభించి ముందుగా అలియా భట్ కాంబినేషన్‌లో వున్న సన్నివేశాల చిత్రీకరణని పూర్తిచేయాలని రాజమౌళి నిర్ణయించినట్టు సమాచారం.

ఇందుకోసం ఆలియా భట్‌ నవంబర్, డిసెంబర్ రెండు నెలలు పూర్తిగా ఆర్ఆర్‌ఆర్‌ కోసమే డేట్లు కేటాయిస్తానని అందుకు తగ్గట్టు షెడ్యూల్ రెడీ చేసుకోవాలని కూడా దర్శకుడికి తెలిపినట్లు సమాచారం. ఒకవేళ ఆ నెలలో కుదరకపోతే మళ్ళీ డేట్స్ అడ్జస్ట్ చేయడం చాలా కష్టమవుతుందని ముందుగానే ఒక కండిషన్ కూడా పెట్టినట్లు తెలుస్తోంది. ఎందుకంటే అలియా పూర్తి చేయాల్సిన ప్రాజెక్టులు చాలానే ఉన్నాయట.అందుకే రాజమౌళి షూటింగ్ కి రెడీ ప్లాన్ చేసుకుంటున్నాడట.