జపాన్‌లో ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం విడుదలై రికార్డుల మోత మోగించింది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా జపాన్‌లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన భారతీయ సినిమాగా నిలిచిందని చిత్ర యూనిట్ ఓ పోస్టర్‌ను రిలీజ్ చేసింది. జపాన్‌లో ఈ మూవీ 80 రోజుల్లోనే 505 మిలియన్ల యెన్స్ రాబట్టిందని తెలిపింది. మరోవైపు ఈ మూవీ ఆస్కార్ బరిలో నిలిచిన సంగతి తెలిసిందే. బెస్ట్ యాక్టర్ విభాగంలో జూ.ఎన్టీఆర్ పోటీ పడుతున్నారు. ఇప్పుడున్న అంచనాలను బట్టి.. ఎన్టీఆర్ కి ఏదో కేటగిరీ కింద అవార్డ్ వచ్చే ఛాన్స్ ఉందని టాక్ నడుస్తోంది.
అన్నట్టు ఇప్పటికే ది అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ అండ్ సైన్సెస్ ఆస్కార్‌కు అర్హత సాధించిన 301 ఫీచర్ ఫిలిమ్స్ జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో ఇండియా నుంచి ఆర్ఆర్ఆర్, గంగుబాయ్ కథియావాడీ, ద కశ్మీరీ ఫైల్స్, కాంతారా సినిమాలు ఉన్నాయి. కాగా, 95వ ఆస్కార్ అవార్డుల ఫైనల్ నామినేషన్స్‌ను జనవరి 24న ప్రకటిస్తారు. ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం 2023 మార్చి 12న లాస్ ఏంజెల్స్‌లోని డాలీ థియేటర్‌లో జరుగుతుంది. మొత్తానికి ఇండియన్ సినిమా నుంచి నాలుగు సినిమాలు రేసులో ఉండటం విశేషమే.
పైగా ఇండియన్ స్టార్స్ కూడా ఆర్ఆర్ఆర్ సినిమా ఆస్కార్ సాధిస్తే చూడాలని ఆశ పడుతున్నారు. తాజాగా ట్విట్టర్ లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ ఒకరిమీద ఒకరు ట్వీట్లు చేసుకుంటున్న క్రమంలో షారుఖ్ ఆర్ఆర్ఆర్ సినిమా ఆస్కార్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. పఠాన్ ట్రైలర్ చూసి.. కంగ్రాట్స్ చెప్పిన చరణ్ కి షారుఖ్ మెసేజ్ చేస్తూ.. ‘థాంక్యూ రామ్ చరణ్. మీ ఆర్ఆర్ఆర్ టీమ్ ఆస్కార్ ని ఇంటికి తెచ్చినప్పుడు.. ఒక్కసారి నన్ను దానిని టచ్ చేయనివ్వండి’ అంటూ ట్వీట్ చేశాడు.
ఇవి కూడా చదవండి…