జక్కన్నా..మజాకా…అందరికి పని పెట్టేశాడు..!

149
rajamouli
- Advertisement -

దర్శకధీరుడు రాజమౌళి ఏం చేసినా ప్రత్యేకమే. కట్టప్ప…బాహుబలిని ఎందుకు చంపాడు అనే చిన్న లాజిక్‌తో సినిమాపై అంజనాలను పెంచేసి బాక్సాఫీస్‌ను షేక్ చేసిన జక్కన్న…తాజాగా మెగాపవర్ స్టార్ రాంచరణ్,యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.

ఈ సినిమా ప్రారంభం అయిన దగ్గరి నుండి ఏ చిన్న వార్తయిన సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతుండగా ఇటీవల సినిమా ప్రమోషన్‌లో భాగంగా విడుదల చేసిన పోస్టర్‌ కూడా తెగ హల్ చల్ చేస్తోంది.

చరణ్, తారక్ బుల్లెట్‌పై ఉన్న పోస్టర్‌కి ఉహించని రెస్పాన్స్‌ రాగా అంతేస్ధాయిలో మీమ్స్‌ వైరల్ అవుతున్నాయి. ట్రాఫిక్ నిబంధనల గురించి కాస్త క్రియేటివ్‌గా చెప్పడానికి సైబరాబాద్ పోలీసులుకు బాగా ఉపయోగపడగా ఇక క్రికెట్ ఫ్యాన్స్‌,హీరోల అభిమానులు తమకు నచ్చిన హీరోల ఫోటోలను షేర్ చేసి సంబర పడిపోతున్నారు.

ప్రభాస్, ఎన్టీఆర్..పవన్, రామ్ చరణ్…,తమిళ హీరో విజయ్,బన్నీ….కోహ్లీ, రోహిత్ ఇలా ఫోటోలను ఎడిట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసి తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. మొత్తంగా ఒకే ఒక పోస్టర్‌తో అందరి అటెన్షన్‌ కొట్టేశారు బాహుబలి జక్కన్న.

- Advertisement -