దీపావళికి రెడీయా..?

147
diwali
- Advertisement -

పొలిటికల్ ఎంట్రీపై ఎంత సస్పెన్స్‌ కొనసాగించారో సూపర్ స్టార్ రజనీ…..ఎవరూ ఉహించని విధంగా ఎంట్రీ ఇవ్వకుండానే రాజకీయాల నుండి తప్పుకున్నారు. హెల్త్ ఇష్యూస్‌తోనే పాలిటిక్స్ నుండి మిడిల్ డ్రాప్ అయిన రజినీకాంత్.. అమెరికాలో చెకప్ చేయించుకుంటున్నారు.

అయితే హెల్త్ ఇష్యూస్ ఉన్న రజనీ మాత్రం అభిమానులను ఏ మాత్రం నిరాశపర్చడం లేదు. వరుస సినిమాలతో అలరించేందుకు సిద్ధమవుతున్నారు. ర‌జ‌నీకాంత్ న‌టించిన తాజా చిత్రం అన్నాత్తె ఎప్పుడు విడుద‌ల అవుతుందా అని ఎదురుచూస్తున్న వారికి గుడ్ న్యూస్ అందించారు. ‘అన్నాత్తే..దీపావళిక్కు రెడీయా’ (అన్నయ్యా.. దీపావళికి రెడీయా) అంటూ రజనీ వెనక్కి తిరిగి ఉన్న ఒక ఫొటోను ట్విట్టర్‌లో పోస్ట్‌ చేసింది.

శివ ద‌ర్శ‌క‌త్వంలో స‌న్ పిక్చ‌ర్స్ నిర్మించిన అన్నాత్తె చిత్రంలో రజనీ గ్రామ పెద్ద పాత్రలో కనిపించనున్నారు. కీర్తీ సురేశ్, నయనతార, మీనా, ఖుష్బూ తదితరులు నటిస్తున్నారు.

- Advertisement -