బాలీవుడ్ చూపు సౌత్ సినిమాల వైపు…!

197
naandi
- Advertisement -

తెలుగు సినిమా మార్కెట్ భారీగా పెరిగిపోయింది. కొత్త కొత్త దర్శకులు ఇండస్ట్రీకి వస్తుండటం,భారీ బడ్జెట్ చిత్రాలతో పాటు చిన్న చిత్రాలు సైతం బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతుండటంతో తెలుగు సినిమాలు ఇతర భాషల్లో భారీగా రీమేక్ అవుతున్నాయి.

ముఖ్యంగా టాలీవుడ్‌లో సినిమా సక్సెస్ అయ్యిందంటే చాలు.. స్టోరీ ఏదైనా సరే వెంటనే రీమేక్ రైట్స్ తీసేసుకుంటోంది బాలీవుడ్. లేటెస్ట్‌గా సౌత్ నుంచి ఎక్స్‌పోర్ట్ అయిన సినిమా ‘రాచ్చసన్’. తమిళ్‌లో విష్ణు విశాల్ లీడ్ రోల్‌లో హిట్ అయిన ‘రాచ్చసన్’ సినిమా తెలుగులో ‘రాక్షసుడుగా రీమేక్ అయ్యి సూపర్ హిట్ అయ్యింది. ఈ మూవీని బాలీవుడ్‌లో అక్షయ్ కుమార్ హీరోగా తెరకెక్కిస్తున్నారు.

అల్లరి నరేష్ సూపర్ హిట్ ‘నాంది’ సినిమాని బాలీవుడ్‌లో రీమేక్ చెయ్యడానికి రెడీ అవుతున్నారు దిల్ రాజు. అజయ్ దేవ్‌గణ్ హీరోగా సినిమాను తెరకెక్కించేలా ప్లాన్ చేస్తుండగా దీనిపై త్వరలోనే అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చే అవకాశం ఉంది.

- Advertisement -