గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా ‘RRR’ మూవీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ‘సిటాడెల్’ వెబ్‌సిరీస్ ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రియాంక.. RRR మూవీని నేను ఇంకా చూడలేదు. నాకు అంత సమయం లేదు. నేను చాలా సినిమాలు చూడను. టీవీ షోలు చూస్తుంటాను అని ప్రియాంక చోప్రా అన్నారు. అయితే, ఆమె కామెంట్స్ పై భారతీయ సినీ అభిమానులు విరుచుకు పడుతున్నారు.
నీకు ఆర్‌ఆర్‌ఆర్ చిత్రాన్ని చూడటానికి ఇప్పటి వరకూ సమయం దొరకలేదు అంటే.. నువ్వు ప్రధాన పాత్రలో నటించిన ‘సిటాడెల్’ వెబ్‌సిరీస్ ను చూడటానికి మాకు సమయం ఎక్కడ నుండి వస్తోంది?, ఒకవేళ సమయం ఉన్నా.. నీ మొహం చూడటానికి కూడా మాకు ఇష్టం లేదు అని ఆమె పై విమర్శలు చేస్తున్నారు. ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రియాంక కామెంట్స్ పై త్రిబుల్ఆర్ అభిమానులు ఇలా మండిపడుతుంటే.. చరణ్ ఫ్యాన్స్ మాత్రం ప్రియాంక చోప్రా పై పాజిటివ్ కామెంట్స్ చేస్తున్నారు.
Also Read: పిక్ టాక్: కుర్ర సమాజం విలవిలలాడిపోవాల్సిందే.
రామ్ చరణ్ ఫ్యాన్స్ ప్రియాంక చోప్రా పై పాజిటివ్ కామెంట్స్ చేయడానికి కారణం.. ఇంటర్వ్యూలో ప్రియాంక చోప్రా చరణ్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. రామ్ చరణ్ గురించి ఆమె మాట్లాడుతూ.. రామ్ చరణ్ చాలా మంచి వ్యక్తి అంటూ చెప్పుకొచ్చింది. అందుకే ప్రియాంక చోప్రా పై చరణ్ ఫ్యాన్స్ కూడా పాజిటివ్ గా స్పందిస్తున్నారు.
Also Read: Spy:సుభాష్ చంద్ర బోస్ బయోపిక్ కాదు