గ్రీన్ ఛాలెంజ్‌కు అపూర్వ స్పందన..

45

గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా ఈ దసరా పండగకి రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన ఊరు ఉరికో జమ్మిచెట్టు-గుడి గుడికో జమ్మి చెట్టు కార్యక్రమానికి అపూర్వ స్పందన లభిస్తుంది. ఇంత మంచి కార్యక్రమం చేపట్టినందుకు తన వంతుగా ల్యాండ్ ఫర్ లైఫ్ అవార్డు విజేత,డంగర్ ప్రభుత్వ కళాశాల(బికనెర్ ,రాజస్థాన్) అసోసియేట్ ప్రొఫెసర్ శ్యామ్ సుందర్ జ్యాని జమ్మి చెట్టు విత్తనాలను మోహన్ చంద్ర ఫర్గెయిన్ ఐఎఫ్‌ఎస్‌కి కొరియర్ ద్వారా పంపారు.

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ద్వారా జమ్మిచెట్లు నాటుతున్న విషయం తెలుసుకుని విత్తనాలను బహుకరించిన ప్రొఫెసర్ శ్యామ్ సుందర్ జ్యానికి, మోహన్ చంద్ర ఫర్గెయిన్ ఐఎఫ్‌ఎస్‌ కి ట్విట్టర్ వేదికగా ఎంపీ సంతోష్ కుమార్ ధన్యవాదాలు తెలియజేశారు.