వరుస ఓటములతో ఉక్కిరిబిక్కిరైన రైజింగ్ పుణె జట్టు మళ్లీ గాడిలో పడింది. ఐపీఎల్లో వరుసగా మూడు ఓటముల తర్వాత విజయాన్నందుకుంది. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో పుణె 27 పరుగుల తేడాతో బెంగళూరును ఓడించింది. మొదట బ్యాటింగ్ చేసిన పుణె 20 ఓవర్లలో 8 వికెట్లకు 161 పరుగులు చేసింది. తివారితో పాటు రహానె (30), త్రిపాఠి (31) రాణించారు. ఛేదనలో స్టోక్స్ (3/18), శార్దుల్ ఠాకూర్ (3/35) విజృంభించడంతో బెంగళూరు 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 134 పరుగులే చేయగలిగింది.
162 పరుగుల ఛేదనలో బెంగళూరు పరుగులు చేయడానికి ఆర్సీబీ చాలా కష్టపడింది. మన్దీప్ (0) ఆరంభంలోనే వెనుదిరిగినా.. కెప్టెన్ కోహ్లి (28; 19 బంతుల్లో 3×4, 1×6), డివిలియర్స్ (29; 30 బంతుల్లో 1×4, 2×6) కాసేపు నిలిచారు. కోహ్లిని స్టోక్స్ ఔట్ చేయడంతో బెంగళూరు 41/2తో ఇబ్బందుల్లో పడింది. ఆ తరువాత డివిలియర్స్‌ని స్టంపౌట్ చేశాడు ధోనీ. ఆ తర్వాత బెంగళూరు కోలుకోలేదు. కేదార్ జాదవ్ (22 బంతుల్లో 18), వాట్సన్ (14; 18 బంతుల్లో 1×4) క్రీజులో ఉన్నా వేగంగా పరుగులు రాలేదు. 10-15 ఓవర్ల మధ్య ఆర్సీబీ బ్యాట్స్‌మెన్ ఒక్క ఫోర్ కూడా కొట్టలేకపోయారంటేనే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఓ వైపు సాధించాల్సినరన్ రేట్ పెరిగిపోతుండగా.. జాదవ్, వాట్సన్ వెనుదిరగడంతో ఆర్సీబీ పనైపోయింది. ఆఖర్లో స్టువర్ట్ బిన్నీ (18; 8 బంతుల్లో 2×4, 1×6) మెరుపులు పరుగుల అంతరాన్ని తగ్గించడానికి మాత్రమే ఉపయోగపడ్డాయి.
అంతకుముందు టాస్ ఓడి రైజింగ్ మొదట బ్యాటింగ్ చేసిన పుణె సూపర్‌జెయింట్ 8 వికెట్లు కొల్పోయి 161 పరుగులు చేసింది. పూణే ఓపెనర్లు అజింక్య రహానె(30), రాహుల్ త్రిపాఠి(31) అదిరే అరంభాన్నిచ్చినప్పటికీ చివరు వరకు కొనసాగించలేకపోయారు పూణే బ్యాట్స్ మెన్లు. అజింక్య రహానెబద్రీ బౌలింగ్‌లో బౌల్డ్ కాగా, మరో ఓపెనర్ రాహుల్ త్రిపాఠి పవన్ నేగీ బౌలింగ్‌లో కోహ్లీకి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. 16వ ఓవర్ చివరి బంతికి షేన్ వాట్సన్ బౌలింగ్‌లో ధోనీ(28) బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాత వెంటనే 17వ ఓవర్లో మొదటి బంతికి అరవింద్ బౌలింగ్‌లో స్మిత్(27) బౌల్డయ్యాడు. బెన్ స్టోక్స్(2), డానియెల్ క్రిస్టియన్(1)లు తక్కువ స్కోరుకే ఔటవడంతో పూణే మరింత కష్టాల్లో పడింది. మనోజ్ తివారీ(20) చివర్లో బ్యాటు ఝులిపించడంతో పూణే 154 పరుగులు చేయగలిగింది. బెంగుళూరు బౌలర్లలో ఆడం మిల్నె, శ్రీనాధ్ అరవింద్‌లకు చెరో రెండు వికెట్లు దక్కగా, షేన్ వాట్సన్, సామ్యెల్ బద్రీ, పవన్ నేగీలకు తలో వికెట్ దక్కాయి.