బెంగళూరు ఎట్టకేలకు మళ్లీ గెలుపు బాట పట్టింది. రెండు ఓటముల తర్వాత పుంజుకున్న ఆ జట్టు.. చక్కని బౌలింగ్‌తో ముంబయి ఇండియన్స్‌పై పైచేయి సాధించింది. కోహ్లీసేన మూడో విజయంతో పాయింట్ల పట్టికలో ఐదో స్థానానికి చేరుకుంది. పేరుకే సొంత మైదానం కానీ ఈ మ్యాచ్‌కు ముందు చిన్నస్వామి స్టేడియంలో బెంగళూరు జట్టు.. ముంబై చేతిలో వరుసగా ఐదు మ్యాచ్‌లు ఓడింది. ఈసారి కూడా బ్యాట్స్‌మెన్ పెద్దగా రాణించకపోవడంతో ఓ మాదిరి స్కోరుకే పరిమితమయ్యింది. ఇక మరో ఓటమి ఖాయమనే అనుకున్నా.. బౌలర్ల సహకారంతో అద్భుతం చేసింది. ఫలితంగా మంగళవారం ముంబై ఇండియన్స్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో 14 పరుగుల తేడాతో నెగ్గింది. ఈ స్టేడియంలో ముంబైతో ఆడిన తొమ్మిది మ్యాచ్‌ల్లో ఈ జట్టుకిది రెండో విజయం.
ముందుగా బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు 20 ఓవర్లలో 7 వికెట్లకు 167 పరుగులు చేసింది. మనన్ వోహ్రా (31 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్లతో 45), మెకల్లమ్ (25 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 37), కోహ్లీ (26 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్‌తో 32) ఓ మాదిరిగా రాణించగా ఆఖర్లో గ్రాండ్‌హోమ్ (10 బంతుల్లో 3 సిక్సర్లతో 23 నాటౌట్) చెలరేగాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ముంబై 20 ఓవర్లలో 7 వికెట్లకు 153 పరుగులు చేసి ఓడింది. హార్దిక్ పాండ్యా (42 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్‌తో 50) రాణించాడు. సౌతీ, సిరాజ్, ఉమేశ్‌లకు రెండేసి వికెట్లు దక్కాయి. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ సౌతీకి దక్కింది.
బెంగళూరు ఇన్నింగ్స్: వోహ్రా ఎల్బీ (బి) మార్కండె 45; డికాక్ (సి) రోహిత్ (బి) మెక్లెనగన్ 7; బ్రెండన్ మెక్‌కలమ్ రనౌట్ 37; కోహ్లి (సి) పొలార్డ్ (బి) హార్దిక్ పాండ్య 32; మన్‌దీప్ సింగ్ (సి) సూర్యకుమార్ (బి) హార్దిక్ పాండ్య 14; గ్రాండ్‌హోమ్ నాటౌట్ 23; వాషింగ్టన్ సుందర్ (సి) రోహిత్ (బి) హార్దిక్ పాండ్య 1; సౌథీ (సి) కటింగ్ (బి) బుమ్రా 1; ఉమేశ్ యాదవ్ నాటౌట్ 1; ఎక్స్‌ట్రాలు 6 మొత్తం: (20 ఓవర్లలో 7 వికెట్లకు) 167;
వికెట్ల పతనం: 1-38, 2-61, 3-121, 4-139, 5-139, 6-141, 7-143;
బౌలింగ్: డుమిని 2-0-28-0; మెక్లెనగన్ 4-0-34-1; బుమ్రా 4-0-22-1; కృనాల్ పాండ్య 4-0-24-0; మార్కండె 3-0-28-1; హార్దిక్ పాండ్య 3-0-28-3
ముంబయి ఇన్నింగ్స్: సూర్యకుమార్ ఎల్బీ(బి) ఉమేశ్ 9; ఇషాన్ కిషన్ (బి) సౌథీ 0; డుమిని రనౌట్ 23; రోహిత్ (సి) డికాక్ (బి) ఉమేశ్ 0; పొలార్డ్ (సి) డికాక్ (బి) సిరాజ్ 13; హార్దిక్ (సి) కోహ్లి (బి) సౌథీ 50; కృనాల్ (సి) మన్‌దీప్ (బి) సిరాజ్ 23; కటింగ్ నాటౌట్ 12; మెక్లనగన్ నాటౌట్ 0; ఎక్స్‌ట్రాలు 23; మొత్తం: (20 ఓవర్లలో 7 వికెట్లకు) 153;
వికెట్ల పతనం: 1-5, 2-21, 3-21, 4-47, 5-84, 6-140, 7-143;
బౌలింగ్: సౌథీ 4-0-25-2; ఉమేశ్ యాదవ్ 4-0-29-2; మహ్మద్ సిరాజ్ 4-0-28-2; చాహల్ 4-0-23-0; వాషింగ్టన్ సుందర్ 1-0-15-0; గ్రాండ్‌హోమ్ 3-0-28-0.