టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న కోహ్లీ..

111
kohli

ఈరోజు ఐపీఎల్‌-13లో మరో రసవత్తరమైన పోటీ జరగనుంది. రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు, కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ జట్లు షార్జా వేదికగా తలపడుతున్నాయి. టాస్‌ గెలిచిన బెంగళూరు సారథి విరాట్‌ కోహ్లీ బ్యాటింగ్‌ ఎంచుకున్నాడు. రెండు జట్లలోనూ హిట్టర్లు ఉండటంతో ఈ పోరులో పరుగుల వరద ఖాయంగా కనిపిస్తోంది. చిన్న మైదానం, ఫ్లాట్‌ వికెట్‌ కావడంతో షార్జాలో భారీ స్కోరు నమోదవుతున్నాయి. సీజన్‌లో ఇప్పటి వరకు పంజాబ్ 7 మ్యాచ్‌లు ఆడగా 6 ఓడిపోయి పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో ఉంది. ఇక బెంగళూరు(5గెలుపు, 2ఓటమి) మూడో స్థానంలో కొనసాగుతోంది.

బెంగళూరు జట్టు ఎలాంటి మార్పు లేకుండా.. సేమ్ టీమ్‌తో బరిలోకి దిగుతోంది. పంజాబ్ జట్టు మూడు మార్పులు చేసింది. ఈ సీజన్‌లో ఇప్పటికే ఈ రెండు జట్లు ఓసారి తలపడ్డాయి. ఇది రెండో మ్యాచ్. గాయంతో మన్‌దీప్ తప్పుకున్నాడు. ఇక ప్రబ్ సిమ్రాన్, ముజీబ్‌ను పక్కనబెట్టారు. వీరి స్థానాల్లో గేల్, మురుగన్ అశ్విన్, దీపక్ హుడా జట్టులోకి వచ్చారు. ఈ సీజన్‌తో క్రిస్ గేల్‌కు ఇదే మొదటి మ్యాచ్. మరి తన పాత టీమ్ బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్‌పై గేల్ ఎలా ఆడతాడన్నది ఆసక్తిగా మారింది.

కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌: కేఎల్ రాహుల్ (కెప్టెన్/వికెట్ కీపర్), మయాంగ్ అగర్వాల్, నికోలస్ పూరన్, గ్లెన్ మాక్స్‌వెల్, దీపక్ హుడా, క్రిస్ జోర్డాన్, మురుగన్ అశ్విన్, మహమ్మద్ షమీ, రవి బిష్ణోయ్, అర్షదీప్ సింగ్.

రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు: విరాట్ కొహ్లీ (కెప్టెన్), ఏబీ డివిలియర్స్ (వికెట్ కీపర్), దేవదత్ పడిక్కల్, అరోన్ ఫించ్, వాషింగ్టన్ సుందర్, శివమ్ దుబే, క్రిస్ మోరిస్, ఇసురు ఉడానా, నవదీప్ సైని, మహమ్మద్ సిరాజ్, యుజ్వేంద్ర చాహల్