4,038 మందికి కరోనా నిర్ధారణ..

213
corona
- Advertisement -

ఏపీలో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. కొద్దిరోజుల రాష్ట్రంలో కరోనా కేసులు 5 వేలకంటే తక్కువగానే నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజా బులెటిన్ వెలువడింది. గడచిన 24 గంటల్లో రాష్ట్రంలో 4,038 మందికి కరోనా నిర్ధారణ అయింది. అత్యధికంగా పశ్చిమ గోదావరి జిల్లాలో 686 కేసులు వచ్చాయి. అత్యల్పంగా విజయనగరం జిల్లాలో 96 కేసులు గుర్తించారు. అదే సమయంలో రాష్ట్రవ్యాప్తంగా 38 మంది మృతి చెందారు. చిత్తూరు జిల్లాల్లో 9 మంది కరోనాతో మరణించారు. తాజాగా 5,622 మంది కరోనా నుంచి కోలుకున్నారు.

ఓవరాల్ గణాంకాలు పరిశీలిస్తే… ఇప్పటివరకు రాష్ట్రంలో నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 7,71,503 కాగా, 7,25,099 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇంకా 40,047 మంది చికిత్స పొందుతున్నారు. అటు, మొత్తం మరణాల సంఖ్య 6,357కి పెరిగింది. పశ్చిమ గోదావరి జిల్లాలో 686 కేసులు, తూర్పు గోదావరి 548, చిత్తూరు 489, కృష్ణాలో 421, గుంటూరు 390, ప్రకాశం 299, అనంతపురం 232, కడప 281, విశాఖ196, నెల్లూరు 178, శ్రీకాకుళం 119, కర్నూలు 103, విజయనగరం జిల్లాలో 96 కేసులు నమోదయ్యాయి.

- Advertisement -