కలెక్టర్ అనితారామచంద్రన్‌కు తప్పిన ప్రమాదం..

507
Collector anitha ramachandran

యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం సమీపంలో జిల్లా కలెక్టర్ అనితారామచంద్రన్‌ కారును లారీ ఢీ కొట్టింది. ఈఘటనలో కలెక్టర్‌కు త్రుటిలో ప్రమాదం తప్పింది. వివరాల్లోకి వేళ్తే..అకాల వర్షం వల్ల నష్టపోయిన పంట పొలాలను వలిగొండ మండలంలో పలు గ్రామాల్లో పర్యటించిన కలెక్టర్ తిరిగి కలెక్టర్ కార్యాలయంకు బయలుదేరుతున్న ఈ క్రమంలో భువనగిరి మండలం నందనం గ్రామ శివారులో ప్రమాదం జరిగింది.. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి నుండి వేగంతో వస్తున్న లారీ ముందు భాగంలో ఉన్న ఇండికా కారుని ఢీకొని, ఎదురుగా వస్తున్న కలెక్టర్ వాహనంకు ఢీకొనడంతో కలెక్టర్ వాహనం పూర్తిగా దెబ్బతింది. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు.