ఎపీలో కాబోయే సీఎం ఎవ‌రో చెప్పేసిన వ‌ర్మ‌..

240
RGV

సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటాడ‌న్న విష‌యం తెలిసిందే. ఈమ‌ధ్య వ‌ర్మ రాజ‌కీయ నాయ‌కుల‌పై కూడా ట్వీట్లు చేస్తున్నాడు. ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ మూవీలో ఇటివ‌లే విడుద‌ల చేసిన రెండు పాట‌లు ఎపీ రాజ‌కీయాల్లో సంచ‌ల‌నంగా మారాయి. తాజాగా ఆయ‌న ఏపీ రాజ‌కీయాల గురించి ట్వీట్ల‌ర్లో మ‌రోసారి స్పందించారు. ఎపీలో త్వ‌ర‌లో జ‌రుగ‌నున్న సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో కాబోయే ముఖ్య‌మంత్రి ఎవ‌రో చెప్పేశారు వ‌ర్మ‌.

Varma ka pal

కేఏ పాల్ సార‌ధ్యంలోని ప్ర‌జాశాంతి పార్టీలో ఎపీలో విజ‌యం సాధిస్తుంద‌ని, 175 స్ధానాల్లో పోటీ చేసి గెలుస్తుంద‌న్నారు. ఎపీకి కాబోయే ముఖ్య‌మంత్రి కేఏ పాల్ అన్నారు. జీసస్ క్రైస్ట్ తర్వాత మళ్లీ అంతటి గొప్ప వ్యక్తి పాలేనని సెటైర్ వేస్తూ ప్రధాని మోదీతో పాల్ కలిసి ఉన్న ఫొటోను పోస్టు చేశాడు.

ప్ర‌పంచంలోనే గొప్ప వ్య‌క్తి అయిన కేఏ పాల్ ఏపీ లాంటి చిన్న రాష్ట్రాల‌కు ముఖ్య‌మంత్రి కావ‌డం క‌న్న ప్ర‌ధాని కావ‌డం మేలు అన్నారు. చంద్రబాబు, జగన్, మోదీ, ట్రంప్ లాంటి చిన్న వ్యక్తులతో పోటీ పడడానికి బదులు తన స్నేహితుడు జీసస్ క్రైస్ట్‌ను అడిగి ప్రపంచ ఎన్నికలు జరిగేలా చూసి ఏకంగా ప్రపంచ నేత కావాలని వ్య‌గ్యంగా స్పందించారు.