అరుదైన రికార్డు క్రియేట్‌ చేసిన ‘రౌడీ బేబీ’..

36
Rowdy Baby Song

తమిళ హీరో ధనుష్, హీరోయిన్ సాయిపల్లవి కలసి నటించిన చిత్రం ‘మారి 2’. బాలాజీ మోహన్ దర్శకత్వంలో రెండేళ్ల క్రితం వచ్చిన ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతాన్ని సమకూర్చాడు. ఇందులోని ‘రౌడీ బేబీ’ పాట సూపర్ డూపర్ హిట్టయిన విషయం తెలిసిందే. ధనుష్, సాయిపల్లవిల డ్యాన్స్ కు ప్రేక్షకులు మత్తెక్కి ఊగిపోయారు. తాజాగా రౌడీ బేబీ సాంగ్ అరుదైన రికార్డు క్రియేట్ చేసింది. యూ ట్యూబ్‌లో ఈ పాట నేటికి 100 కోట్ల (బిలియన్) వ్యూస్ ను సొంతం చేసుకుని రికార్డు సృష్టించింది.

కొల‌వెరీ డీ పాట 9వ వార్షికోత్స‌వం జ‌రుపుకుంటున్న రోజే రౌడీ బేబీ పాట 1 బిలియ‌న్ వ్యూస్ సాధించ‌డం యాదృచ్చికం. ఈ రికార్డు సాధించ‌డం గొప్ప స‌త్కారంగా భావిస్తున్నా. పాట‌ల‌ను ఆద‌రిస్తున్న ప్ర‌జ‌లంద‌రికీ మా టీం తరుపున కృత‌జ్ఞ‌త‌లు అని ధనుష్ ట్వీట్ చేశాడు. 1 బిలియ‌న్ల సంఖ్య‌లో ప్రేమ‌ను కురిపించి..రౌడీ బేబీ సాంగ్ ఆద‌రిస్తున్నందుకు ధ‌న్య‌వాదాలు అని సాయిప‌ల్ల‌వి ట్వీట్ చేసింది.

Maari 2 - Rowdy Baby (Video Song) | Dhanush, Sai Pallavi | Yuvan Shankar Raja | Balaji Mohan