బిగ్ బాస్ 4…ఎపిసోడ్ 72 హైలైట్స్

42
episode 72

బుల్లితెర రియాల్టీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 విజయవంతంగా 72 ఎపిసోడ్స్ పూర్తి చేసుకుంది. ఇక సోమవారం 72వ ఎపిసోడ్ కావడంతో ఇంటి సభ్యుల్లోని అఖిల్,అవినాష్ మినహా మిగితా వారంతా ఎలిమినేషన్‌కు నామినేట్ కాగా ఈ ప్రక్రియ మొత్తం హాట్ హాట్‌గా సాగింది. ముఖ్యంగా అఖిల్ వర్సెస్ అభిజిత్,హారిక వర్సెస్ సొహైల్,లాస్య వర్సెస్ అరియానా ఇలా హౌస్ పెంటపెంటైంది.

తొలుత మార్నింగ్ వేకప్ సాంగ్‌కి టక్కరి దొంగ సినిమా సాంగ్‌కి స్టెప్పులు వేశారు ఇంటి సభ్యులు. తర్వాత సొహైల్ దగ్గర అభి, హారిక, లాస్య గురించి మాట్లాడుతూ వాళ్ల ముఖాలలో నవ్వులు కనిపించడం లేదని తెలిపాడు అఖిల్. అనంతరం కెప్టెన్ బ్యాండ్ ధరించాలని అఖిల్‌కి బిగ్ బాస్ చెప్పడంతో సొహైల్ కెప్టెన్ బ్యాండ్ ఇస్తూ సింహం ఆఫ్ ది హౌస్‌లో అంటూ గట్టిగా అరిచాడు. కెప్టెన్ అయిన వ్యక్తికి రేషన్ మేనేజర్‌ని ఎంపిక చేసే అధికారం ఉండటంతో .. లాస్యని రేషన్ మేనేజర్‌గా నియమించాడు. నాగార్జున స్పెషల్ గిఫ్ట్‌గా పంపించిన మటన్‌ని చూసి పండగ చేసుకున్నారు.

ఇక అసలైన నామినేషన్ ప్రక్రియను అఖిల్‌తో ప్రారంభించాడు బిగ్ బాస్. ఒక్కో ఇంటి సభ్యుడు ఇద్దరిద్దరు వరస్ట్ పెర్ఫామర్స్‌ని ఎంపిక చేసి నామినేట్ చేయాలని చెప్పారు. అఖిల్…అంతా ఊహించినట్లే అభిజిత్,హారికలను నామినేట్ చేశారు. ఈ సందర్భంగా అఖిల్-అభిజిత్ మధ్య పెద్ద గొడవ జరిగింది. తాను సీక్రెట్ రూంకి వెళ్లిన తరువాత బ్లఫ్ అంటూ తప్పుగా మాట్లాడాడు. బాధపడ్డానని చెప్పాడు కానీ అది నిజంకాదు. పైగా అతను రోబో టాస్క్‌లో తప్పితే ఇంకే టాస్క్‌లో ఆడినట్టుగా నాకు కనిపించలేదని రీజన్ తెలిపాడు. మటన్ షాపు ఓనర్ మేకకి గడ్డి చూపించాడు. మేక లోపలికి వెళ్లిపోయింది. తరువాత ఏం కాలేదు అభిజిత్.. మేకని మటన్ షాపు ఓనర్ ఎక్స్ ట్రా ప్రోటీన్స్ పెట్టి పులిగా బయటకు వదిలాడు. అదే నేను కెప్టెన్ అయ్యా అంటూ తెలిపాడు అఖిల్.

ఇక హారిక గురించి మాట్లాడుతూ.. అఖిల్ సింపథీ కార్డ్ ఎన్నిసార్లు యూజ్ చేస్తున్నాడో అన్నావ్ అది తనకు నచ్చలేదు అందుకే నామినేట్ చేశా అని తెలిపాడు. తర్వాత అరియానా….అభిజిత్, లాస్యను నామినేట్ చేసింది. ఈ సందర్భంగా అరియానా- లాస్య మధ్య మాటల యుద్దం జరిగింది.సొహైల్.. హారికను నామినేట్ చేస్తూ ఫైర్ అయ్యాడు. నిన్ను ఎవడూ దేకడు అంటూ మాట్లాడింది.. ఆమెను పొట్టి అన్నందుకే తెగ ఫీల్ అయిపోయింది..వేస్ట్ గాడు, ఎవరూ పట్టించుకోరు అంటూ నా కాలదా అంటూ హారికతో గొడవకు దిగాడు.తర్వాత అభిజిత్‌ని నామినేట్ చేశాడు సొహైల్.

అభిజిత్.. సొహైల్, అరియానాలను నామినేట్ చేశాడు. సొహైల్ నీ యవ్వా అని అనడం తనకు నచ్చలేదని.. రెస్పెక్ట్ ఇచ్చిపుచ్చుకుంటే బాగుంటుందని వార్నింగ్ ఇచ్చాడు. నా యాస భాష ఇలాగే ఉంటుందని.. నీలా నాది బ్రో బ్యాచ్ కాదని హారికకు తగిలేలా అనడంతో.. నా ఊతపదం కూడా వేస్ట్ గాడు అంటూ కౌంటర్ ఇచ్చింది.తర్వాత మోనాల్.. లాస్య, అవినాష్, లాస్య.. మోనాల్, అరియానా, అవినాష్.. మోనాల్, అభిజిత్‌లను నామినేట్ చేశారు. దీంతో 11వ వారం ఎలిమినేషన్‌లో అభి,మోనాల్, హారిక, లాస్య, అరియానా, సొహైల్‌ ఆరుగురు ఉన్నారు.