రిటైర్మెంట్‌పై క్లారిటీ ఇచ్చిన రాస్ టేలర్..!

108
taylor

క్రికెట్‌కు గుడ్ బై చెప్పే ఆలోచన ఇప్పట్లో లేదని తేల్చి చెప్పారు రాస్ టేలర్. ఆటను ఆస్వాదించగలిగినన్ని రోజులు క్రికెట్‌ ఆడతానని, ప్రస్తుతానికి తన ఫామ్‌కు ఏమాత్రం ఢోకా లేదని, స్థాయికి తగ్గ ప్రతిభను కనబర్చలేని రోజు స్వచ్చందంగా తప్పుకుంటానని పేర్కొన్నాడు.

వయస్సనేది కేవలం ఓ నంబర్‌ మాత్రమేనని, దాన్ని అటతో ముడిపెట్టడం ఏమాత్రం కరెక్ట్‌ కాదన్నారు. తన రిటైర్మెంట్‌పై వస్తున్న ఊహాగానాలకు చెక్‌ పెట్టిన టేలర్‌..జాతీయ జట్టుకు మరికొన్నేళ్లు అడగలిగే సత్తా తనలో ఉందని తేల్చి చెప్పాడు.

నేటి తరం ఆటగాళ్లు రిటైర్మెంట్‌పై లెక్కలేసుకోవడం మానుకోవాలని, వారిలో సత్తా ఉన్నన్ని రోజులు జట్టుకు సేవలందించడంపై దృష్టి సారించాలని సూచించాడు.2019 వన్డే ప్రపంచకప్‌ ఓ పీడకల అని తెలిపాడు. ఆ సమయంలో రిటైర్మెంట్ తీసుకోవాలని అనుకున్నానని కానీ ఇప్పుడు మనసు మార్చుకున్నట్లు వెల్లడించారు.