కరోనా…ఆర్జీవీ ఇంట్లో విషాదం

114
rgv

కరోనా సెకండ్ వేవ్‌ తెలుగు రాష్ట్రాల్లో కల్లోలం సృష్టిస్తోంది. కరోనాతో ప్రజల ప్రాణాలు పిట్టల్లా రాలిపోతుండగా పలువురు సినీ,రాజకీయ ప్రముఖలు ఇళ్లల్లో కూడా విషాదం నెలకొంది. తాజాగా వివాదాస్పద దర్శకుడు ఆర్జీవీ ఇంట్లో కరోనా విషాదం నింపింది.

వర్మ సోద‌రుడు పి.సోమ‌శేఖ‌ర్ ఆదివారం క‌రోనాతో క‌న్నుమూశారు. కొద్ది రోజుల క్రితం ఆయ‌న‌కు క‌రోనా సోక‌గా హైద‌రాబాద్‌లోని ప్రైవేటు ఆసుప‌త్రిలో చికిత్స పొందుతూ క‌న్నుమూశారు. ‘ముస్కురాకే దేఖ్‌ జరా’ అనే బాలీవుడ్ మూవీకి దర్శకుడిగా పనిచేసిన ఆయ‌న రంగీలా, దౌడ్‌‌, సత్య, జంగిల్‌, కంపెనీ వంటి సినిమాలకు ప్రొడక్షన్‌ బాధ్యతలు నిర్వర్తించారు.